Wednesday, April 24, 2024
- Advertisement -

పసిడి ప్రేమికులు శుభవార్త.. దిగోస్తున్న బంగారం ధర!

- Advertisement -

గత ఏడాది ప్రపంచాన్ని కరోనా వణికిం చినా, లాక్ డౌన్లు పెట్టినా బంగారం రేట్లు మాత్రం పైపైకే దూసుకెళ్లాయి. వారం రోజులుగా అయితే రోజురోజుకూ మరిం తగా తగ్గుతూ వస్తున్నాయి. బంగారం ధర ఈరోజు కూడా తగ్గింది. పసిడి రేటు దిగిరావడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ లో గురువారం తులం (10 గ్రాములు) బంగారం రూ.49 వేలకు దిగొచ్చిం ది. అసలు సరిగ్గా నెల కిం ద రూ.53,500 ఉండగా.. ఇప్పుడు దాదాపు ఐదు వేలు తగ్గింది.

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించింది. దీంతో రేటు రూ.48,380కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పడిపోయింది. దీంతో ధర రూ.44,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినా కూడా దేశీ మార్కెట్‌లో పసిడి రేట్లు పడిపోవడం గమనార్హం. స్టాక్​మార్కెట్లు పడిపోవడం, అమెరికా​ఫెడ్​ నిర్ణయాల ఎఫెక్ట్, టోకుగా బంగారానికి డిమాండ్​ పెరగడంతో గత ఏడాది బంగారం రేట్లు దూసుకెళ్లాయి.

బంగారం దిగుమతులపై కస్టమ్స్​ డ్యూటీని 12.5% నుంచి 7.5 శాతానికి తగ్గిస్తామని కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. దీనితోనూ రేట్లు దిగొస్తున్నాయి. ఇప్పట్లో పెద్ద పండుగలు ఏవీ లేకపోవడం, ఎకానమీ క్రైసిస్, లాక్​డౌన్​ ఎఫెక్ట్​ వల్ల జనం ఇన్​కం తగ్గడంతో బంగారం వైపు మహిళల చూపు కాస్త తగ్గిందంటున్నారు.

40 ఏళ్ల వయసులో సునామీ ఇన్నింగ్స్, చూస్తారా!

వర్మకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సెన్సార్‌ బోర్డు!

నన్ను టార్గెట్ చేస్తున్నారు.. వాళ్లను పట్టుకోండి లేదంటే మౌనదీక్షకు దిగుతాను!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -