Thursday, May 2, 2024
- Advertisement -

లోదుస్తులు అమ్మింది… క్రెడిట్ ,అవార్డు కొట్టింది

- Advertisement -

మగువలు పైకి కనిపించే దుస్తుల విషయంలో తీసుకునే ఇంట్రెస్ట్… లోదుస్తుల విషయంలో ఉండదనే మాట ఉంది. అది నిజం కూడా.మనదేశంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది.దీనితో వేసుకునే దుస్తులలో ఆకృతి తేడా వచ్చి.. చిన్నపాటి అసౌకర్యం కలుగుతుంటుంది.

దీనికి పరిష్కారంగా బటర్ కప్స్ సేవలను అందిస్తుంది… అర్పితా గణేష్ .ఈవిడ సందర్భంగా ,ఆకృతికి తగిన లోదుస్తులను అందిస్తున్నారు. ఇదే అర్పితకు వినియోగదారుల సంఖ్యను పెంచేలా చేసింది. తాజాగా గూగుల్‌ నుంచి స్మాల్‌ బిజినెస్‌ హీరోస్‌ అవార్డునూ తెచ్చిపెట్టింది. మన దేశంలో ఎనభై శాతం అమ్మాయిలు వారికి స్యూట్ అయ్యే లోదుస్తులు వేసుకోరని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.అంతర్జాతీయంగా మొత్తం 150 సైజుల్లో లోదుస్తులు లభిస్తుంటే మన దేశంలో ఆ సంఖ్య కేవలం 40కే పరిమితమైంది. లో దుస్తులు అన్ని సైజుల్లో అందరికీ అందుబాటులో లేకపోవడం, ఎవరికి ఎలాంటివి సరిపోతాయో అనే అవగాహన లేకపోవడమే అందుకు ప్రధాన కారణం. దీనికి తోడు ఇప్పటికీ మన దేశంలో లోదుస్తుల గురించి చాలామంది బహిరంగంగా మాట్లాడరు. చివరకు చదువుకున్న అమ్మాయిలు కూడా వాటిని కొనుగోలు చేయడానికి సిగ్గుపడతారు.

ఇవన్నీ గమనించిన అర్పిత బటర్ కప్స్ సేవలను అందిస్తున్నారు. ఇంకో విషయం ఏమిటంటే అర్పిత స్వతహాగా బెంగళూరు వాసి. పుట్టింది అక్కడే అయినా హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తిచేశారు. ఓసారి న్యూయార్క్‌ వెళ్లారు. అక్కడ ఎదురైన చిన్న సంఘటనే నన్ను ఈ సంస్థను ప్రారంభించేలా చేసిందని చెబుతున్నారు. 200మంది మహిళలు ఒక్కొక్కరు 1500 రూపాయల చొప్పున నన్ను నమ్మి నాకు డబ్బు ఇచ్చారు. అదే నా సంస్థకు పెట్టుబడి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -