Friday, April 19, 2024
- Advertisement -

అప్పుడే అర‌వై……

- Advertisement -

చిరంజీవి. అదొక దీవెన మాత్రమే కాదు…ఎందరో ఆశీస్సులతో  పైకెదిగిన ఓ బలమైన శక్తి పేరు కూడా .కొన్ని లక్షల గొంతులు ఇవ్వాల ఆ పేరును స్మరిస్తున్నాయంటే  అతని స్థాయి ఏపాటిదో…

ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అంతటి ఎఫెక్టివ్ పర్సన్ ఇపుడు వ‌య‌స్సు ప‌రంగా 60లోకి ఎంటరయ్యాడు.తన అభిమానుల సమక్షంలో షష్టి  పూర్తి చేసుకుంటున్నాడు.అప్పుడే… అరవయ్యా…. అనిపించేతంగా ఆశ్యర్యానికి గురి చేస్తోన్న చిరంజీవి నేడు ఈ స్థాయిలో నిల‌వ‌డం కోసం ప‌డిన క‌ష్టం అలాంటి ఇలాంటిది కాదు.

 చిరంజీవి గురించి తెలుసుకోవ‌ల్సిన విష‌యాలు……. 

1. తెలుగు పరిశ్రమను రెండున్నర దశాబ్దాల పాటు ఏకచత్రాదిపత్యం గా పాలించి ….ఓ వెలుగు వెలిగిన హీరో చిరంజీవి.అయితే టాలీవుడ్లో హీరోయిజాన్ని అంతలా శాసించిన చిరు…. తొలినాళ్లలో చాలా కష్టాలే అనుభవించాడు.అతని సినీ రంగ ప్రవేశం మనమనుకున్నంత వీజీగా అయితే జ‌రిగిపోలేదు. 

 2. చిరు కెరియర్…. మొదట్లో గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో మనవూరి పాండవులు,ఇది కథ కాదు చిత్రాలను చెపుకోవాలి.కోతల రాయుడు,పున్నమి నాగు లాంటి  సినిమాలు అతనిలోని నటుడిని బయటకు తీసాయి.తొలినాళ్లలో అవసరం కోసం అటు విలన్ గాను చేయాల్సి వ‌చ్చింది.

3.   80’s లో చిరు ఫేస్ చేసిన ప్రాబ్లెమ్స్ అన్నీ ఇన్నీ కావు. అప్పటికే పరిశ్రమలో టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు ఎందరో ఉన్నారు.అయితే వారిని దాటుకు వెళ్లాలన్నీ,కనీసం వారి దరిదాపుల్లోకి వెళ్లాలన్నీ చాలా కష్ట సాధ్యమైన పని . అలాంటి సందర్బంలో చిరు వేసిన అడుగులు ఎంద‌రో వ‌ర్దమాన న‌టుల‌కు ఆద‌ర్శంగా నిలిచాయి.

4. చిరంజీవి లెవెల్ పెరగడానికి అతని స్థాయి మారడానికి ప్రధాన కారకుడు అల్లు రామలింగయ్య.పిల్ల నిచ్చి పెళ్లి చేసిన అల్లు..ఆతరువాత చిరంజీవి ఎదుగుదలకు తనవంతు కృషి తాను చేశారు.చిరంజీవి ప్రతి అడుగులోను ఆయన కష్టం,తెలివి రెండు ప్రతిబింబిస్తాయి.

5. ఖైదీతో చిరులో మాస్ యాంగిల్ బయటపడింది.ఈసినిమాలో ప్రతి ఫ్రేమ్లో చిరంజీవి నటన  పీక్ స్టేజుల్లో  ఉంటుంది.చిరంజీవిలోని ఆ స్పీడ్  చూసి ఆతరం వారు అతనికి  సుప్రీం హీరో అనే టైటిల్ ను కట్టపెట్టారు.

6. చిరు వ‌చ్చిన టైమ్లో …. అప్పటి వరకు డాన్సులు అంటే హీరోయిన్లు మాత్రమే చేసేవారు .,హీరో లు మాత్రం నడవాలి ,అప్పుడపుడు హమ్ చేయాలి ,. కాని చిరు రాక‌తో  మగవాళ్ళ మార్కు స్టెప్స్ కోరియోగ్రఫీ చేయటం మొదలుపెట్టారు ,ప్రేక్షకులు వాటిని చాల  కొత్తగా చూసారు .

7.   1980 వరకు తెలుగు సినిమాలు అంటే పారలల్ ప్యాంటు ,గళ్ళ చొక్కాలు ,రంగుల ప్యాంటు దానికి మించి బ్లాక్ అండ్ వైట్    సినిమాలు ,కాని చిరంజీవి వచ్చాక వాటిని బ్రేక్ చేస్తూ జీన్స్ -T  షర్ట్స్ వేస్తూ కొత్త ట్రెండ్ సృష్టించాడు . చిరు రాక ముందు సినిమాలు కేవలం ఆంధ్ర లోనే ఎక్కువగా చూసేవారు ,తెలంగాణా లో హైదరాబాద్ మినహా మార్కెట్ అసలు ఉండేది కాదు . కాని చిరు సినిమాల్లోకొచ్చాక తెలంగాణాలో పెద్ద ఎత్తున అభిమానులు ఏర్పడ్డారు.

8. చిరు 80’s లో చాల ఫిట్ గా  హీమ్యాన్ ల ఉండే వాడు. ఒకవిదంగా చెప్పాలంటే తెలుగు మొట్ట మొదటి సిక్స్ ప్యాక్ హీరో అని చెప్పొచ్చు .అడవి దొంగ,ఖైది  లలో చిరుకు ఆల్మోస్ట్ సిక్స్ ప్యాక్ మెయిన్ టైన్ చేశాడు.

9. చిరంజీవి తర్వాత వచ్చిన సుమన్ ,వెంకటేష్ ,నాగార్జున చిరును ఫాలో అవుతూ ఫిట్ట్ గా  కనిపించడానికి ట్రై చేశారంటేనే… అర్ధం చేసుకోవచ్చు. చిరు తన తోటి హీరోలపై ఎంత ప్రభావాన్ని చూపాడో.

 10. పసివాడి ప్రాణం,యముడికి మొగుడు,అత్తకు యముడు అమ్మాయికి మొగుడు లాంటి బ్లాక్ బస్టర్స్ తో చిరంజీవి ఇమేజ్ ఓ రేంజ్లోకి వెళ్లిపోయింది.ఆత‌రువాత‌ అతన్ని ఎవ్వరూ అందుకోలేకపోయారు.

11. అప్రతిహతంగా దూసుకుపోతున్న చిరుకు ఒక్కసారిగా 90’s మిడ్లో ఓ పెద్ద కుదుపే వచ్చింది. దాన్నించి ఆయన బయటపడడానికి చేయ‌ని  పథక రచన లేదు.అయితే చివ‌ర‌కు అత‌ను హిట్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ లో లైన్లోకి వ‌చ్చాడు.

12. చిరు ఏం చేసినా సంచలనంగా మారిపోయింది.ఫైట్ ల విషయం లో చిరు వచ్చాకా స్పీడ్ వచ్చింది,దీనితో క్రమ‌క్రమంగా స్క్రీన్ ప్లే లో మార్పులు వచ్చాయి .

 13.  నేటి తరం హీరోలకు ధీటుగా చిరు సినిమాలు చేశాడు.తన రేంజ్ తో కుర్రహీరోలను బెదరగొట్టేశాడు. దానికి ఇంద్ర,ఠాగూర్ చిత్రాలే బెస్ట్ ఎక్జాంపుల్ .ఆ టైమ్లో చిరంజీవి చిత్రం వ‌స్తుందంటే….డేట్లు మార్చుకోవ‌డ‌మెలా అనే దానిపై ఫోక‌స్ పెట్టారు.

14. ఒక వైపు పవన్ తో టాలీవుడ్లో వండర్స్ క్రియేట్ చేయిస్తూనే…మరో వైపు కుమారుడు చరణ్ కు మఘధీర లాంటి అఖండ విజయాన్ని దగ్గరుండి మరీ అందించాడు.

15.పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక చిరు సినిమాలకు బ్రేక్ చెప్పేశాడు.కాని రాజ‌కీయంగా చాలా దెబ్బలు తిన్నాడు. క‌రెక్ట్ గైడెన్స్ ,సొంత మీడియా లేక‌పోవ‌డ‌మే దానికి కార‌ణ‌మ‌ని చిరు బావిస్తూ ఉంటాడు. కాని వారసుల విష‌యంలో మాత్రం  వన్ బై వన్ పరిశ్రమపైకి వదిలాడు.ఎవరికి దొరికిన ర్యాంక్ ను వారు దోచేశారు.

16.  ఎపుడూ ఉండే బర్త్ డే సెలబ్రేషన్సే ఈసారి కూడా ఉన్నాయనుకోవడానికి వీల్లేదు.ప్రజెంట్ బర్త్ డే ఎవ్వరూ ఊహించనంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు.మరి ఈ సారి చేస్తోన్న బర్త్ డే ఉన్న సమ్ థింగ్ స్పెషల్ చిరు ష‌ష్టిపూర్తి చేయ‌డం.

 ఇదండి చిరంజీవిగారి సంగ‌తి. రెండు తరాలు అలా చూస్తుండగానే చిరు ప్రస్థానం ఎలా వచ్చి  ఎలా సాగిందో తెలుసుకుంటుంటేనే ఆశ్చర్య మేస్తోంది.అన్నయ్య అప్పుడే అరవయ్యేళ్ల చిరుప్రాయంలోకి  వచ్చేశాడంటే ఇప్పటికీ ఎవ్వరూ నమ్మలేకపోతున్నారు. ఇపుడిది చాలదన్నట్లు యు టర్న్ తీసుకుని మరీ… అన్నయ్య మళ్లీ సినిమాలు చేస్తూ ఉండడం అది అతనికి మాత్రమే  చెల్లింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -