Thursday, April 18, 2024
- Advertisement -

బీట్రూట్ తో బాదేయెచ్చు తెలుసా..

- Advertisement -

బీట్‌రూట్‌ అనగా అంతా మొఖం విరుస్తారు. దీన్నెక్కడ తింటాం అంటారు. దీనిని క్యారెట్ తో కలుపుకుని జ్యూస్ చేసి తాగితే వచ్చే ఆ రుచే వేరు. చూడడానికి బీట్ రూట్ ఎర్రగా ఆకర్షణీయంగానే ఉంటుంది. బీట్‌రూట్‌తో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.వాటి గురించి చాలామందికి తెలియదు. వన్స్ తెలిస్తే వద్దులే అని చెప్పినా వదిలిపెట్టరు..

బీట్‌రూట్‌లో కనిపించే… ఆ చిక్కటి ఎరుపు వర్ణానికి బిటాలెయిన్స్‌ అనే నీళ్లలో కరిగే యాంటీ ఆక్సిడెంట్‌ ఉంది. అది చాలా శక్తిమంతమైనది. ఫ్రీరాడికల్స్‌ను తొలగించి, అనేక రకాల క్యాన్సర్లను ఇట్టే నివారిస్తుంది. విటమిన్‌–సి కూడా ఎక్కువే. ఇది మంచి యాంటీఆక్సిడెంట్‌ కాబట్టి క్యాన్సర్ల నివారణకు తోడ్పడటంతో పాటు కొలాజెన్‌ ఫామ్ కావడానికి తోడ్పడి… లాంగ్ టైమ్ స్కిన్ లైట్ నెస్ కి దోహదం చేస్తుంది. రెగ్యులర్ గా ఎక్సర్ సైజ్ లు చేస్తూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తీసుకునేవారిలో అలసిపోకుండా చాలాసేపు ఉండగలిగే సామర్థ్యం స్టామినా ఉంటుంది. ఇందులో పొటాషియమ్‌ ఎక్కువగా ఉండటం వలన నీరసం, నిస్సత్తువ, మజిల్‌క్రాంప్స్‌ను దూరం చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ ను నివారిస్తుంది.

బీట్ రూట్లో ఎన్నో ఖనిజలవణాలున్నాయి. క్యాల్షియమ్, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, సోడియమ్, జింక్, కాపర్, సెలీనియం వంటి ఎన్నో పోషకాలు ఉండటం వల్ల… అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బీట్‌రూట్‌లోని కాల్షియమ్‌ ఎముకల, పళ్ల బలాన్ని పెంచుతుంది. ఫోలేట్‌ అనే పోషకం పుష్కలంగా ఉండటం వల్ల బీట్‌రూట్‌ గర్భిణుల్లో పిండానికి వచ్చే అనేక రకాల వెన్నుపూస సమస్యలను నివారిస్తుంది. అంతే కాదు గర్భస్రావాల సమస్యను అధిగమిస్తుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్‌ను తగ్గించి రక్తనాళాల, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బీట్‌రూట్‌ మతిమరపును నివారిస్తుంది. ఈ మేరకు 2011లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. అన్ని రకాల కండరాలతో పాటు గుండె కండరాన్ని సైతం మరింత బలంగా ఉండేలా చేస్తుంది బీట్‌రూట్‌. హార్ట్‌ఫెయిల్‌ అయిన వారికి క్రమం తప్పకుండా బీట్‌రూట్‌ జ్యూస్‌ ఇవ్వడం వలన… గుండె కండర సామర్థ్యం పదమూడు రెట్లు పెరిగినట్లు 2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. బీట్ రూట్లో ఉన్న మరో ప్రధాన ప్లస్ పాయింట్ అంగసమస్యతో బాధపడేవారికి… రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది.అందుకే ఒక నెల పాటు బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా రక్తం,హిమోగ్లోబిన్ శాతాలు పెరిగి.. రాత్రుళ్లు మంచాలు ఇట్టే విరగొట్టచ్చంటారు.

Also Read:

జీడిప‌ప్పు ఆరోగ్య ర‌హ‌ష్యాలు

టాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో తెలుసా ?

సాయి పల్లవి గురించి మీకు తెలియని నిజాలు !

రాత్రి త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -