Friday, May 3, 2024
- Advertisement -

వైఎస్ ఉండి ఉంటే తెలంగాణా వచ్చేది కాదు, టీఆర్ఎస్ ఉండేదీ కాదుః ఎబిఎన్ ఆర్కే

- Advertisement -

2014 ఎన్నికల సమయంలో రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం వైఎస్ రాజశేఖరరెడ్డే అనే స్థాయిలో ప్రచారం చేసింది పచ్చ బ్యాచ్. పవన్ కళ్యాణ్ కూడా అదే రాగం తీశాడు. ఎన్నికల్లో బాగానే లాభపడ్డారు. ఇప్పుడు మాత్రం అసలు నిజాలను నిస్సిగ్గుగా ఒప్పేసుకుంటున్నారు. అది కూడా పచ్చ దళం వ్యూహకర్త, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణనే అసలు విషయాలు చెప్పుకొచ్చాడు. తన వీకెండ్ కామెంట్‌లోనే ఈ నిజాలన్నీ చెప్పడం గమనార్హం.

‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు కెసీఆర్‌తో సహా అందరూ తెలంగాణాపై ఆశలు వదులుకున్నారు. తెలంగాణా రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అస్థిత్వం కూడా ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ వ్యూహ రచనలో తిరుగులేదనిపించుకున్న కెసీఆర్……ఆ నాడు నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది.’…….ఇవీ తన వీకెండ్ కామెంట్‌లో రాధాకృష్ణ రాసుకొచ్చిన వాక్యాలు. వైఎస్ ఉండి ఉంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడే అవకాశమే లేదు…..టీఆర్ఎస్ పార్టీ ఉండేదే కాదు అని తేల్చేశాడు. ఇదే రాధాకృష్ణ 2014 ఎన్నికల సమయంలో మాత్రం రాష్ట్ర విభజనకు వైఎస్సే కారణం, జగనే కారణం అని ఎన్ని సార్లు అబద్ధాలు రాశాడో, ఏ స్థాయిలో ప్రజలను నమ్మించాడో చెప్పనవసరంలేదు. ఇక పచ్చ బ్యాచ్‌తో అంటకాగిన పవన్ కళ్యాణ్ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా విభజనకు వైఎస్సే కారణమని అజ్ఙాన పలుకులు పలికేశాడు. అలా 2014లో చంద్రబాబు అధికారంలోకి రావడానికి కారణమై ఐదు కోట్ల సీమాంధ్రప్రజలు నష్టపోయేలా చేయడమే కాదు కాదు ఇప్పుడు అదే చంద్రబాబు, లోకేష్‌….వాళ్ళ భజన మీడియా దెబ్బకు నానా కష్టాలూ పడుతున్నాడు. ఇదే వీకెండ్ కామెంట్‌లో రాధాకృష్ణ మరో విషయం కూడా చెప్పుకొచ్చాడు. ఎపిలో అధికారంలోకి రావడం కోసం తెలంగాణా ఏర్పాటుకు చంద్రబాబు లేఖలు ఇవ్వడం గురించి కూడా వివరించుకొచ్చాడు రాధాకృష్ణ.

మొత్తంగా చూస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి ఉంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పడి ఉండేది కాదు, తెలంగాణా రాష్ట్ర సమితి కూడా ఉండేది కాదు అన్న నిజాలను ఇప్పటికైనా పచ్చ బ్యాచ్ ఒప్పుకోవడం మాత్రం గొప్ప విషయం అని చెప్పుకోవాలేమో. ఎందుకంటే వైఎస్‌ల మంచితనం, సమర్థతలో కూడా నెగిటివ్ చూడగల సమర్థులు కదా బాబు అండ్ కో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -