Saturday, April 20, 2024
- Advertisement -

ఆ సర్వే జగన్మోహన్ రెడ్డికి ఓ హెచ్చరిక

- Advertisement -

ఇండియా టుడే- మై యాక్సిస్ ఇండియా సంస్థల సర్వేను విశ్వసించలేమా ? గతంలోనూ ఇండియాటుడే పలు రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే అంచనాలకు, వాస్తవ ఫలితాలకు పొంతనే లేకుండా పోయిందా ? అవుననే అంటున్నారు ఏపీ టీడీపీ నాయకులు. తాజాగా ఇండియా టుడే సర్వేలో వెళ్లడించిన అంశాలు పూర్తిగా అవాస్తవాలని తేల్చి పారేస్తున్నారు. వైఎస్ జగన్ కు 43 శాతం, చంద్రబాబుకు 38 శాతం, పవన్ కళ్యాణ్ కు 5 శాతం మంది మద్దతు తెలుపుతున్నారంటూ ఇండియా టుడే చేసిన సర్వేపై పెదవి విరిచేస్తున్నారు. తమ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ టీడీపీ నేతలు ఇండియా టుడే సర్వేపై ట్రోల్స్ చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

పైన చూపించిన టేబుల్స్ చూస్తే టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో అవాస్తవాలు లేవనేది స్పష్టంగా అర్ధమైపోతోంది. ఇండియాటుడే సర్వేలో నిజాలు ఎన్ని ? అబద్ధాలు ఎన్ని ? అనేది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. తాజాగా ఏపీలో వైఎస్ఆర్ సీపీదే అధికారం అంటూ ఆ సంస్థ చేసిన సర్వేను పక్కన పెట్టేయాల్సిన పని లేదు. అలా అని నమ్మాల్సిన పని లేదు. కానీ ఆ సర్వేను చూసి ఓవర్ కాన్ఫిడెన్స్ తో వైఎస్ఆర్ సీపీ నేతలు ఏమాత్రం అలసత్వం వహించినా ఫలితాలు తారుమారు అయిపోవడం ఖాయం. గతంలోనూ ఆ ఓవర్ కాన్ఫిడెన్సే వారి కొంపముంచింది. ఇప్పుడు కూడా ఇలాంటి సర్వేలు చాలా వస్తుంటాయి. వాటిని చూస్తూ ఊహల్లో విహరిస్తూ బద్దకరత్నాలుగా మిగిలిపోతే నవరత్నాలు కాదు కదా ఏ రత్నాలు కూడా వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులను గట్టెక్కించలేవు. సో ఇండియా టుడే సర్వేను చూసి మురిసిపోవడం కంటే, ఆ సర్వేపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడితే విజయం వైఎస్ఆర్ సీపీదే. లేదంటే చెప్పేదేముంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -