Thursday, May 2, 2024
- Advertisement -

లవంగాలతో ఎంత ఆరోగ్యమో మీకు తెలుసా!

- Advertisement -

లవంగము అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. దీనిలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలూ, యాంటిబయోటిక్ గుణాలూ ఉన్నాయని మీకు తెలుసా? ఇంతే కాదు మీరు తెలుసుకోవలసినది ఇంకా చాలా ఉంది. లవంగం చెట్టు మీద ఎండిపోయి రాలిన పూలే మన దగ్గరికి లవంగాలుగా వస్తాయి. లవంగంలో ఉండే పోషకాలు శరీరంలోని అన్నిరకాల వ్యవస్థకు మేలు చేస్తాయి.

లవంగం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. గొంతు నొప్పిని నయం చేయడం దగ్గరనుంచి – సాధారణ జలుబుతో పోరాడుతూ, ఇంకా అనేక ఇతర వైద్యపరమైన ఔషధ గుణాలను ఈ లవంగములు కలిగి ఉన్నది.  ఇందులోఉండే మాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

బలమైన ఎముకల నిర్మాణానికి సాయం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్–-సి ఇమ్యూనిటీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని యాక్టివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంచుతుంది. ఇక లవంగాల్లో మాత్రమే ఉండే ఎజినాల్ అనే కెమికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శరీరంలో ప్రి-రాడికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డుకుంటుంది. లవంగాల్లో ఉండే ‘నైలిసిసిన్’ అనే కెమికల్ షుగర్ ను కంట్రోల్ చేస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటీ  స్టడీలో తేలింది.

ఇన్సులిన్ ఉత్పత్తి పెంచేలా చేసి షుగర్ లెవెల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కంట్రోల్లో ఉంచుతుందని పరిశోధకులు తేల్చారు. లవంగాలను నానబెట్టి, పేస్టులా చేసి గాయాలకు రాస్తే యాంటిసెప్టిక్ క్రీమ్ గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటి ఫంగల్, యాంటి గ్రిమిసిడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గాయం దగ్గర ఉన్న బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్ కాకుండా అడ్డుకుంటుంది.

ప్రయాణ సమయంలో గానీ, తిన్న ఆహారం జీర్ణ సమస్య ఉన్నప్పుడు వికారం, వాంతులు ఉంటుంది. అప్పుడు లవంగాలు వేసుకుంటే సరి. ఇట్టే తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును అరికడుతాయి. బీపీని కంట్రోల్‌ చేస్తాయి. వ్యాధి నిరోదక శక్తిని పెంచుతాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. కాలేయ మరియు చర్మసమస్యలను నివారిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -