Thursday, May 2, 2024
- Advertisement -

బాబు-ముఖేష్ భేటీః ఈ వేషాలతోనే బాబును మోడీ పూర్తిగా దూరం పెట్టేసింది

- Advertisement -

వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ మరణం వెనకాల ఉన్న కుట్రలు అంటూ బలంగా, సాక్ష్యాధారాలతో సహా వినిపించిన విషయాలు గుర్తున్నాయా? పచ్చ కామెర్ల బ్యాచ్‌ని పక్కన పెడితే కళ్ళున్న ఎవడికైనా కాస్త కామన్‌సెన్స్‌తో ఆలోచిస్తే నిజాలన్నీ ఇట్టే తెలిసిపోతాయి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇంకా బలమైన సాక్ష్యాలుగా కనిపిస్తున్నవే. వైఎస్ నాకు మిత్రుడు అని చెప్పుకునే వాళ్ళు చేసిన పని అది.

చంద్రబాబుకు ఎమ్మెల్యే సీటు, మంత్రి పదవి రావడంలో వైఎస్ సహాయం ఉందన్నది నిజం. పిల్లనిచ్చి, పెళ్ళి చేసి పార్టీలోనూ, అధికారంలోనూ ప్రధాన పాత్రను ఇచ్చి పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వైఎస్ విషయంలో కూడా అదే చేశాడు. వైఎస్‌ని ఏ స్థాయిలో విమర్శించాడో, వైఎస్ వ్యక్తిత్వాన్ని ఏ స్థాయిలో హననం చేయాలని చూశాడో చెప్పనవసరం లేదు. వైఎస్ ఉండగా బాబుకు అధికారం దక్కే ఛాన్సేలేదు అన్న భయం అంతా కూడా.

ఇక ఇప్పుడు మోడీతో కూడా ఒక వైపు మిత్ర ధర్మం అంటూనే మరోవైపు తన ప్లాన్స్ తాను చేసుకుంటున్నాడు చంద్రబాబు. 2019 ఎన్నికల తర్వాత ఢిల్లీ పాలిటిక్స్‌ని శాసించాలని, అవకాశం వస్తే ప్రధాని పదవి కూడా చేపట్టాలన్నది చంద్రబాబు కల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేయాలన్న ఆశ చంద్రబాబుది. అందుకే నిన్న ముఖేష్ అంబాని చేత కూడా చంద్రబాబు ఇంకా అత్యున్నత స్థానంలో ఉంటే దేశంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అని పొడిగించుకున్నాడు. ఆ మధ్య టిడిపి భజన పరుల చేత కూడా ఇలాంటి పొగడ్తలే చేయించుకున్నాడు చంద్రబాబు. ఇక అదానీలతో పోటీ నేపథ్యంలో రామోజీరావుకు అత్యంత సన్నిహితంగా ఉండే అంబానీలు చంద్రబాబుతో కలిసి సాగాలనే ప్రయత్నంలో ఉన్నారు. అందుకే చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను మొత్తాన్ని రిలయన్స్‌కి అప్పనంగా రాసిచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడని మేథావులు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నారు. ముఖేష్ అంబానీతో కలిసి చంద్రబాబు చేస్తున్న మంతనాలు మోడీ వరకూ చేరకుండా ఉంటాయా? ఇలాంటి విషయాల్లో చంద్రబాబును మించిన ఘనుడు మోడీ. బాబుగారి ప్రధాని ఆశయం, కుమారరత్నం లోకేష్ ముఖ్యమంత్రి ఆశలు ఆయన జనాలకు ఆనందంగా అనిపించొచ్చేమో కానీ వ్యక్తి గత స్వార్థాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలి చేస్తూ ఉండడం మాత్రం ప్రజలకు ఆవేదన కలిగిస్తూ ఉంది అనడంలో సందేహం లేదు. గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు పూర్తిగా అన్యాయం చేస్తూ తన రాజకీయ ఎదుగుదల కోసం రాజకీయాలు చేస్తూ ఉండడాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు క్షమిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -