Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్, కీరవాణి…… ఈ పైత్యమేంటి? దేశభక్తికి మూఢభక్తికి ముడిపెట్టడం ఏంటి?

- Advertisement -

జాతీయ సార్వభౌమత్వం, దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆచరణలో పవన్ వ్యవహారాలను పరిశీలిస్తే మాత్రం కేవలం పుస్తకాల్లో ఉండే పడికట్టు పదాలను వల్లెవేసినట్టుగా చెప్తున్నాడు తప్పితే పవన్‌కి అంతటి నిబద్ధత కానీ, పరిణతి కానీ ఉన్నట్టు అస్సలు కనిపించవు.

తెలంగాణా విభజన జరిగినప్పుడు 11 రోజులపాటు ఆహారమే ముట్టలేదని కామెడీగా చెప్పాడు పవన్. ఆహారం తీసుకోకుండా అన్ని రోజులు ఈ పవర్ స్టార్ ఎలా బ్రతకాడో, నిజ జీవితంలో అంతటి అద్భుతం ఎలా సాధ్యమైందో పవనే చెప్పాలి. ఎందుకంటే పవన్ నిరాహారదీక్ష విషయం ఇంకెవ్వరికీ తెలియదు కాబట్టి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుని గెలిపించాలన్న ఒప్పందానికి పవన్ కమిట్ అయ్యాడు కాబట్టి అక్కడి ఓటర్లను మెప్పించడం కోసం పవన్ వదిలిన ట్రంప్ కార్డ్ లాంటి డైలాగ్ అది.

కట్ చేస్తే ఇప్పుడు తెలంగాణాలో పర్యటిస్తున్న పవన్‌కి ఆ డైలాగే పెద్ద అడ్డంకి అయింది. అందుకే తెలంగాణా కోసం నా రక్తం ధారపోస్తా. ప్రాణాలిచ్చేస్తా అన్న రొటీన్ డైలాగులు కొట్టాడు. అప్పటికీ స్పందన రాకపోవడంతో జై తెలంగాణా నినాదాన్ని ఏకంగా వందేమాతరం నినాదం అంత పవర్ఫుల్ నినాదంగా చెప్పుకొచ్చాడు. ఇక్కడ నిజంగా తెలంగాణాపై అభిమానంతో పవన్ ఆ మాట చెప్పలేదన్నది నిజం. కేవలం రాజకీయ స్వార్థం కోసం చెప్పాడు. స్వార్థం కోసం వందేమాతరం లాంటి భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన నినాదాలను వాడేసుకోవచ్చా? ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే పవన్‌కి అసలు దేశభక్తి గురించి మాట్లాడే అర్హత ఉందా? పవన్ జ్ఙానం, చిత్తశుద్ధిపై ఇక్కడే ఎన్నో అనుమానాలు వస్తున్నాయి?

ఇక ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అయితే జైబాలయ్య నినాదం నాకు జై హింద్ నినాదంలా వినిపించిందని……… జై బాలయ్య కూడా జైహింద్ నినాదం లాంటిది అని చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే ఒక స్వాత్రంత్ర్య సమరయోధుడు కీరవాణికి దిమ్మతిరిగిపోయే స్థాయిలో కౌంటర్స్ ఇచ్చాడు. కనీస స్థాయిలో ఆలోచనలు కూడా లేకుండా వ్యక్తిగత స్వార్థం, ప్రయోజనాల కోసం జైహింద్, వందేమాతరం లాంటి నినాదాలను వాడుకోవాలనుకోవడం పవన్, కీరవాణిల దిగజారుడు వ్యక్తిత్వం, అథమస్థాయి ఆలోచనలను తెలియచేస్తుందన్నది మాత్రం నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -