Friday, April 19, 2024
- Advertisement -

ప‌ద్యాలొస్తే.. ఫ్రీ పెట్రోల్!

- Advertisement -

ప‌ద్యాలు, సామెత‌లు పాత‌వైపోయాయి. అవి చ‌దివేరాన్నా.. పాడే వార‌న్నా.. మ‌నం మోటుగా క‌నిపిస్తారు. మొత్తం ఇంగ్లీషు మాట‌లంటే, పాట‌లంటే.. ఇప్పుడు మోజు. ఆ ఉబిలోనే ఇప్పుడు అంద‌రం బ్ర‌తుకుతున్నాం.. ఇంకొన్ని రోజులైతే.. ప‌ద్యాలా? అవి ఎలా ఉంటాయి? అని అడిగినా మ‌నం ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

దానికి కార‌ణం మాతృభాష‌పై మోజు త‌గ్గ‌డమే.. అలాగే ఇంగ్లీష్ అంటే మోజు పెర‌గ‌డ‌మే. కానీ తమిళ వ్య‌క్తి త‌న భాష మీద ఉన్న ప్రేమ‌ను కొత్త‌గా చూపిస్తున్నాడు. ప‌లువురిని ఆలోచించేలా చేస్తున్నాడు. త‌మిళ‌నాడుకు చెందిన సెంగుత్తువన్ అనే వ్య‌క్తి చేస్తున్న ప‌ని గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. మాతృ భాష‌పై ఆయ‌న చూపిస్తున్న ప్రేమ‌కు అంద‌రూ జేజేలు ప‌లుకుతున్నారు.

తన పెట్రోల్‌ బంకులో వింత రీతిలో ఒక ప్ర‌యోగం చేస్తున్నాడు. అదేంటంటే పద్యం చెప్పు.. పెట్రోల్‌ పట్టుకెళ్లు అనే ఆఫర్‌ను ప్రకటించాడు. తిరుక్కురల్‌లోని 20 ద్విపద పద్యాలు చెప్తే ఒక లీటర్ పెట్రోలు ఫ్రీగా పోస్తున్నాడు. 10 పద్యాలు చెప్తే అర లీటర్ పెట్రోల్ పోస్తున్నాడు. పెట్రోలు రేటు ఆకాశాన్ని అంటుతున్న స‌మ‌యంలో వారి వారి పిల్లలను కూర్చోబెట్టి పద్యాలు నేర్పించి పెట్రోలు కోసం ఎంతో మంది ఆయ‌న బంక్ ద‌గ్గ‌ర‌కు పోతున్నార‌ట‌. జనవరి 16న ప్రకటించిన ఈ ఆఫర్‌ ఏప్రిల్‌ 30తో ముగియనుండ‌ట‌. ఇప్పటివరకు 176 మంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నార‌ట‌. మీరుకూడా ట్రై చేయండి వీలైతే..


ఈ ఫ్రీ పెట్రోల్‌ ఆఫర్‌ గురించి సెంగుత్తువన్‌ మాట్లాడుతూ.. “లాక్‌డౌన్‌ వల్ల పిల్లలు ఫోన్లకు మరింత అతుక్కుపోయారు. వారు ప్రముఖ తిరుక్కురళ్‌ పద్యాలు నేర్చుకోవాలన్న కాంక్షతోనే ఈ ఆఫర్‌కు శ్రీకారం చుట్టాను. ఒకరికి ఒకసారి మాత్రమే ఫ్రీ పెట్రోల్‌ లాంటి ఆంక్షలేమీ లేవు. కాకపోతే రెండోసారి ఈ ఆఫర్‌ అందుకోవాలంటే మళ్లీ కొత్త పద్యాలు అప్పజెప్పాల్సిందే. తల్లిదండ్రుల భారాన్ని కొంతైనా తీర్చాలంటే పిల్లలు పద్యాలు కంఠస్తం చేయక తప్పదు మరి” అని చెప్తున్నాడు.

నాందిలో న‌రేష్ న‌ట విశ్వ‌రూపం..!

‘లైగ‌ర్‌’లో దుమ్ము లేపుతున్న అన‌న్య

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -