Friday, May 10, 2024
- Advertisement -

ఈ స్టార్స్ అసలు ఎందుకు చనిపోయారో తెలుసా..?

- Advertisement -

సినిమాలో ఎవరు ఉన్న.. లేకున్న హీరోయిన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. హీరోయిన్ లేని సినిమాకి గ్లామర్ తక్కువ. అయితే ఈ హీరోయిన్ అవ్వాలని చాలా మంది వచ్చిన అందరికి ఆ అవకాశం దక్కదు. కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతోంది. అయితే హీరోయిన్ కాకముందు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు. ఏది ఏమైన వారు హీరోయిన్ గా కొనసాగాడానికి కష్టపడుతారు. ఇక హీరోగా చాన్స్ వచ్చిన అబ్బాయి.. వరస హీట్స్ ఉంటే పర్లేదు.

అదే వరసగా ప్లాప్స్ చూస్తే.. అతని ప్రేక్షకులు చూడరు. అయితే పరిశ్రమలో మంచి స్థాయిలో దూసుకెళ్లిన నటీనటులు ఉన్నట్టుండి మృత్యువు ఒడిలోకి జారి పోయారు. వారి మరణం వెనక కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. తెలుగు,తమిళ భాషల్లో నటించిన ప్రత్యూష.. మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో ప్రత్యూష మాత్రం చికిత్స తీసుకుంటూ చనిపోయింది. . కెరీర్లో అప్పుడే ఎదుగుతున్న ప్రత్యూష మరణం మిస్టరీగా ఉండిపోయింది. ఇక టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ముద్రను వేసుకొని అష్టాచెమ్మా సినిమాలో రెండవ హీరోయిన్ గా వెండితెర మీద కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంది భార్గవి.

కెరీర్ లో ఒక గుర్తింపు ప్రారంభం అయ్యే సమయంలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఏలురుకి చెందిన విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చిన తర్వాత సిల్క్ స్మిత గా మారిపోయింది. దర్శకుడు వినుచక్రవర్తి.. ఈమెను సినీ రంగ ప్రవేశం చేయించారు. ఓ సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి పేరు రావడంతో.. సిల్క్ స్మిత అనే పేరునే స్క్రీన్ నేమ్ గా మార్చుకుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె శృంగార తారగా ఎదిదింది. కెరీర్ బాగా సాగుతున్న టైంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, ఓ స్టార్ తో ప్రేమాయణమే ఆమె మరణానికి కారణం అనే వార్తలు వినిపించాయి.

ఇక చిత్రం సినిమాతో చిన్న వయసులోనే హీరోగా తెరంగ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టాడు. తెరంగ్రేటంతోనే వరుసగా మూడు హిట్ చిత్రాల్లో నటించి హాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస పరాజయాలు చవి చూసిన ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయసులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధిక ఇబ్బందులే కారణమని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -