శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య దగ్గరకు వచ్చి తనకు న్యాయం కావాలంటూ.. మా నాన్నగారండి ఆయనకు ఇద్దరు ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకు నండి అంటూ సందడి చేసిన వాడ్రేవు విశ్వనాథమ్ వివిధ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి తెలుగువారి హృదయాలను కొల్లగొట్టారు. వాడ్రేవు విశ్వనాథమ్ కూతురు శ్రీకాంతి తన తండ్రికి సంబంధించిన విషయాలను తాజాగా ముచ్చటించారు.
ఇండస్ట్రీ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసిన వాడ్రేవు విశ్వనాథమ్ కి నాటకాలంటే ఎంతో పిచ్చి.నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. ఈవిధంగా నటనపై ఆసక్తి ఉండడంతో సినిమాలలోకి వచ్చిన నాన్నగారు సినిమాలలో హాస్య పాత్రలలో నటించినపటికి ఇంట్లో ఎంతో సైలెంట్గా ఉండేవారని, నాన్న ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉండే వారని తెలిపారు.
Also read:బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టబోతున్న సత్యదేవ్!
నాన్నగారికి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే ఎంతో అభిమానం అని, వారు కూడా నాన్నగారి పట్ల అంతే అభిమానం వ్యక్తం చేసే వారని తెలిపారు. ఈ సందర్భంగా తన తండ్రి కి ఎన్టీఆర్ కి మధ్య ఉన్న అనుబంధం గురించి శ్రీకాంతి తెలిపారు. ఎన్టీఆర్ ఎంత స్టార్ హీరో అయినప్పటికీ చిన్న చిన్న కళాకారులను సైతం ఎంతో గుర్తుపెట్టుకునే వారని,ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. ఈ క్రమంలోనే పొట్టి ప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ఏకంగా బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు. ఆ సమయంలో బాలకృష్ణ గారిని దగ్గరుండి నేనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. అప్పుడు నేను నాలుగవ తరగతి చదువుతున్నా..ఆ సమయంలో బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారని అప్పటి సంగతులను శ్రీకాంతి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
Also read:రెమ్యూనరేషన్ విషయంలో ఆ నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపిన శర్వానంద్?
