Friday, May 3, 2024
- Advertisement -

విజయవాడ ఎంపి కోసం జగన్ భారీ వ్యూహం…. బాబు ఎదుర్కోగలడా?

- Advertisement -

కేశినేని లాంటి కోట్లు వెదజల్లగల బిజినెస్ మేన్…..సొంత కులపు ఓటర్లదే డామినేషన్ అన్న చంద్రబాబు ధీమాను ఎదుర్కొని విజయవాడలో జగన్ వైకాపా జెండా ఎగరేయగలడా? విజయవాడ ఎంపి సీటు విషయంలో జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఈ అంశాలే అమరావతి ఏరియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. విజయవాడ ఎంపి సీటులో గెలవడానికి జగన్ రచించిన భారీ వ్యూహం చంద్రబాబులో కూడా టెన్షన్ పుట్టిస్తోంది.

కృష్ణాజిల్లాలో కూడా మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు గెలవడంతో పాటు విజయవాడ ఎంపి సీటు కూడా గెలుచుకునేదిశగా వ్యూహం రచించాడు జగన్. చంద్రబాబు సొంత కులం డామినేషన్‌ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న కాపులు, వైశ్యులతో పాటు బ్రాహ్మణులు కూడా ఈ సారి పూర్తిగా వైకాపాకు అండగా నిలబడేలా స్థానిక కుల సంఘాలు తీర్మానించేలా చేయడంలో వైకాపా నాయకులు సక్సెస్ అయ్యారు. మల్లాది విష్ణుతో పాటు ఆర్కేలాంటి నాయకులు జగన్ వ్యూహాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. తాజాగా బిగ్గెస్ట్ బిజినెస్ మేన్ అయిన దాసరి రమేష్ కూడా వైకాపా గెలుపు కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం అంటూ ముందుకొచ్చారు. టికెట్ ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదు కానీ వైకాపా నాయకులను బూతులు తిడుతూ రాజకీయాలు చేసిన కేశినేని నానీని ఓడించాలన్న పట్టుదల వైకాపా నాయకుల్లో కనిపిస్తోంది. కేశినేని నానీకి వ్యతిరేకంగా బిసీలు కూడా తీర్మానాలు చేస్తుండడం ఇప్పుడు చంద్రబాబులో కూడా టెన్షన్ పెంచుతోంది.

అవసరమైతే అభ్యర్థిని మార్చే దిశగా కూడా బాబు ఆలోచనలు చేశాడు కానీ ఇప్పటికే పార్టీ కోసం భారీగా ఖర్చుపెట్టిన నానీ……..టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడతానని తేల్చిచెప్పడంతో ఇప్పుడు కేశినేని నానిని ఎలా గెలిపించాలో తెలియక టిడిపి వ్యూహకర్తలు సతమతమవుతున్నారు. ఐక్యంగా విజయవాడ ఎంపీ సీటు గెలుపు కోసం కష్టపడేలా నాయకులను ఒప్పించిన జగన్ విజయవాడ సీటును వైకాపా ఖాతాలో పడేలా చేయడంలో సక్సెస్ అవుతారా? అదే జరిగితే మాత్రం అమరావతి భ్రమలన్నీ సొంత ప్రజలు కూడా నమ్మలేదన్న కఠోర నిజం చంద్రబాబుకు బోధపడడం ఖాయం అని విశ్లేషకులు చెప్తున్నారు. 19 ఎంపీ సీట్లలో వైకాపా గెలుపు ఖాయం అని జాతీయ స్థాయి సర్వేలు తేల్చి చెప్తున్న నేపథ్యంలో బెజవాడలో కూడా వైకాపా జెండా ఎగురుతుందేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -