Friday, April 19, 2024
- Advertisement -

సిడ్నీ మైదానంలో పుజారా, పంత్ కు ద‌క్కిన అరుదైన గౌర‌వం…

- Advertisement -

సిడ్నీలో జ‌రిగిన నాలుగో టెస్ట్‌లో పుజారా, రిష‌బ్ అద్భుత బ్యాంటింగ్‌తో మొద‌టి ఇన్నీంగ్స్‌లో భారీ స్కోరు చేసింది టీమిండియా. చతేశ్వర్‌ పుజారా (373 బంతుల్లో 193; 22 ఫోర్లు), యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (189 బంతుల్లో 159 నాటౌట్‌; 15 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకం… ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (114 బంతుల్లో 81; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీతో అదరగొట్టారు.

చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా, రిషబ్‌పంత్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో శతకాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్‌ మైదానం(ఎస్‌సీజీ)లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పుజారా 193 పరుగులు చేయగా.. పంత్‌ 159 నాటౌట్‌గా నిలిచాడు. దీంతో వారికి అరుదైన గౌర‌వం ద‌క్కింది.

ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ లేదా ఐదు వికెట్లు లేదా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన ఆటగాళ్లను గౌరవించడం ఎస్‌సీజీ ఆనవాయితీ. ఇందులో భాగంగా మైదానంలోని హానర్స్‌ బోర్డుపై ఈ ఘనత సాధించిన ఆటగాళ్లు పేర్లు చేర్చి వారి సంతకాలు తీసుకుంటారు. ఇప్పుడు పుజారా, పంత్‌.. ఈ బోర్డుపై తమ సంతకాలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -