Sunday, April 28, 2024
- Advertisement -

ఆ ఇద్దరు ఆటగాళ్లు రిటైర్మెంటేనా?

- Advertisement -

టీమిండియా గెలుపులో వారిద్దరిది ప్రత్యేక స్థానం. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు గెలుపులో కీలక పాత్ర పోషించారు. వారే పుజారా, రహానే. ద్రావిడ్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేయడంలో సక్సెస్ అయ్యారు పుజారా. టీమిండియా నయా వాల్‌గా గుర్తింపు పొందారు.

ఓవరాల్ గా టెస్టుల్లో 103 మ్యాచ్ లు ఆడిన పూజారా 44.4 స్ట్రైక్ రేట్, 43.6 సగటు తో 7195 పరుగులు చేశాడు. అయితే ప్రస్తుతం టీమిండియాలో యువ ఆటగాళ్లు సత్తాచాటుతుండటంతో పూజారా జట్టులో చోటు కోల్పోయాడు.

ఇక పూజారా తర్వాత ఆస్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రహానే. ఈ ఇద్దరు ఇద్దరే. అందుకే వీరు మళ్ళీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తే వీరిద్దరి కెరీర్ దాదాపు ముగిసిందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -