గంగూలీకి అస్వ‌స్థ‌త‌.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

- Advertisement -

బీసీసీఐ చీఫ్ సౌర‌వ్ గంగూలీ మ‌రోసారి అనారోగ్యం బారిన ప‌డ్డాడు. ఛాతీ నొప్పి రావ‌డంతో దాదాను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కోల్‌క‌త్తాలోని అపోలో హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌ను చేర్పించారు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీకి కొన్ని రోజుల క్రితం గుండెపోటుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో స‌హ‌చ‌ర ఆట‌గాళ్ల‌తో పాటు అభిమానులంతా ఆయ‌న కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేశారు.

దాదా కోలుకోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు దాదా మళ్లీ ఆసుపత్రి పాలుకావ‌డంతో ఫ్యాన్్స‌లో క‌ల‌వ‌రం మొద‌లైంది. నిజానికి నిన్న‌నే ఛాతీలో కాస్త నొప్పి రావ‌డంతో గంగూలీ మందులు తీసుకున్నారు.

- Advertisement -

అయితే బుధ‌వారం నొప్పి మ‌రీ ఎక్కువ కావ‌డంతో ముందు జాగ్రత్తగా గంగూలీని ఆసుపత్రికి తరలించినట్టు స‌మాచారం. ఏదేమైనా దాదా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా భార‌త జ‌ట్టు మాజీ సార‌థి ర‌విశాస్త్రికి అప్ప‌ట్లో గుండెపోటు రాగా, ఆయ‌న కోలుకున్నారు.

యువ హీరోతో లిప్‌లాక్‌కు రెడీ అయిన భామ‌..?

టాలీవుడ్ హీరోల ఆస్తుల విలువ ఎంతనో తెలుసా ?

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News