Tuesday, April 23, 2024
- Advertisement -

పుజారా కు తప్పిన పెను ప్రమాదం.. బాల్ తగిలి పగిలిన హెల్మెట్!

- Advertisement -

న్యూజిలాండ్ తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో షాకింగ్ సంఘటన జరిగింది. టాస్ గెలిచిన కివీస్ భారత్‌ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో టీమిండియా ఆటను ప్రారంభించింది. శుభ్‌మన్ గిల్ తర్వాత చతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు. అయితే, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ విసిరిన బౌన్సర్ బంతితో పుజారాకు కొద్దిలో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. వాగ్నర్ వేసిన బంతిని ఫుల్ చేసేందుకు పుజారా ప్రయత్నించాడు. కానీ.. ఆ బాల్ బ్యాట్‌కి దొరకకుండా నేరుగా వెళ్లి పుజారా హెల్మెట్‌కి గట్టిగా తగిలింది. దాంతో హెట్మెట్ హెల్మెట్‌‌లోని కొంత భాగం ఎగిరి క్రీజులో పడింది.

అయితే హెల్మెట్ ఉండటం వల్ల ఈరోజు పుజారా బతికిపోయాడని.. లేదంటే అంత వేగంగా వచ్చిన బంతి అతనికి తాకి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని సోషల్ మీడియాలో పుజారా ఫొటోను షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 37వ ఓవర్ వేసిన వాగ్నర్.. గంటకి 130కిమీ వేగంతో బంతులను విసురుతున్నాడు.

ఆ బాల్‌ను పుజారా ఒక్కసారిగా ఫుల్ చేయబోయాడు. కానీ.. ఆ బంతి బలంగా పుజారా హెల్మెట్‌కి తాకింది. ఈ సంఘటన తర్వాత పుజారా కు బౌలర్ సారీ చెప్పాడు. మొత్తానికి ఎలాంటి పుజారా కు గాయం కాకపోవడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

https://twitter.com/All_aboutsport_/status/1406234958591455244?s=20

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -