జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చేదు అనుభ‌వం

- Advertisement -

టీమిండియా బౌల‌ర్లు జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మ్యాచ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో కొంత‌మంది ఆక‌తాయిలు వారిపై వ‌ర్ణ వివ‌క్ష వ్యాఖ్య‌లు చేశారు. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న భార‌త జ‌ట్టు తాత్కాలిక కెప్టెన్ అజింక్య ర‌హానే అంపైర్లు, మ్యాచ్ రిఫ‌రీకి ఫిర్యాదు చేశాడు. ఐసీసీ సైతం దీనిపై తీవ్రంగా స్పందించిన‌ట్లు తెలుస్తోంది.

సిరాజ్‌, బుమ్రాలకు జ‌రిగిన అవ‌మానంపై భార‌త అభిమానులు భ‌గ్గుమంటున్నారు. జాత్య‌హంకార వ్యాఖ్య‌లు చేసిన వారిని సోష‌ల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. ఆసీస్ క్రికెట‌ర్ల వికెట్లు ప‌డ‌గొడుతూ స‌వాల్ విసురుతున్న ఈ యువ బౌల‌ర్ల ప్ర‌తిభ చూసి ఓర్వ‌లేక అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతున్నారంటూ మండిప‌డుతున్నారు. ఆసీస్ ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ అల‌వాటు మీకు కూడా అంటుకుందా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో జ‌రిగిన మంకీగేట్ వివాదాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్త‌విస్తున్నారు. అప్ప‌ట్లో ఆండ్రూ సైమండ్స్‌ , హర్భజన్‌ సింగ్‌ల మధ్య గొడ‌వ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

- Advertisement -

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే.. . తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 338 పరుగులకు ఆట ముగించ‌గా.. టీమిండియా 244 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్.. ప‌కోవ్‌స్కీ వికెట్ ప‌డ‌గొట్టాడు. కాగా రెగ్యుల‌ర్ కెప్టెన్ కోహ్లి గైర్హాజ‌రీలో రెండో టెస్టులో ర‌హానే సార‌థ్యంలోని జ‌ట్టు విజ‌యం సాధించ‌డంలో అరంగేట్ర బౌల‌ర్ సిరాజ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన సంగ‌తి తెలిసిందే. బుమ్రాతో ఆసీస్ బ్యాట్్స‌మ‌న్‌కు చుక్క‌లు చూపించాడు.

త్వరగా కూల్చకపోతే సిడ్నీలో గండమే!

ఏయ్ నీకిష్ట‌మైన క్రికెట‌ర్ ఎవ‌రు.. గిల్ కౌంట‌ర్‌!

నోరు పారేసుకున్న వార్న్.. మ‌రీ ఇంత నీచ‌మా!

వేశ్య పాత్రల్లో అద్భుత నటన

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...