- Advertisement -

సౌతాఫ్రికాతో తొలి వన్డే..టీమిండియా జట్టు ఇదేనా?

- Advertisement -

భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేటి నుండి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే, సిరీస్ నుంచి తప్పుకున్న శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌ల స్థానంలో ఎవరు ఆడతారు? అన్న సందిగ్దం అందరిలో నెలకొంది.

గత కొన్ని నెలలుగా, భారత్ ఆడుతున్న ఫార్మాట్‌తో సంబంధం లేకుండా, ప్రతి గేమ్‌లోనూ ప్లేయింగ్ XI పై ఎప్పుడూ ఆసక్తి నెలకొంటోంది. వీలైనంత ఎక్కువ మంది ఆల్-రౌండర్లను ఆడించాలనే వారి కొత్త విధానం కొన్నిసార్లు జట్టుకు హాని కలిగించినా, బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల్లో జట్టుకు కొంత బాలాన్ని ఇస్తుంది.

ఇక ఇవాళ రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు అంచనా ప్లేయింగ్ XIని అంచనా వేస్తున్నారు. యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ గత సిరీస్‌లో ఆస్ట్రేలియాపై ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. జైస్వాల్‌కు జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇది గొప్ప అవకాశం. అ

నాలుగో స్థానంలో ఎవరు ఆడతారనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, తిలక్ వర్మ మూడు ఆప్షన్లు. గైక్వాడ్ రైట్ హ్యాండర్ కావడంతో అతనికి అవకాశం దక్కవచ్చు. అయితే, పంత్‌కు కూడా తన సత్తా నిరూపించుకోవడానికి మరో అవకాశం దక్కవచ్చు. విరాట్ కోహ్లి మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారనడంలో సందేహం లేదు. రాహుల్ ఈ సిరీస్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తానని చెప్పినప్పటికీ, ఐదో స్థానంలో రాహుల్ (వికెట్ కీపర్) బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అతని తర్వాత ఆల్-రౌండర్లు రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ ఆడతారు. కులదీప్ యాదవ్ మూడో స్పిన్నర్‌గా ఆడతాడా, లేక ప్రసిద్ధ్ కృష్ణ రూపంలో ఒక ఫాస్ట్ బౌలర్‌ను ఆడించాలా అనేది చూడాలి.

భారత్త జట్టు అంచనా :

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్/రిషబ్ పంత్, KL రాహుల్ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కులదీప్ యాదవ్/ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -