- Advertisement -

చెల‌రేగిన ఆసిస్ బౌల‌ర్లు…126 కే కుప్ప‌కూలిన భార‌త్‌..

- Advertisement -

విశాఖ‌లో జ‌ర‌గుతున్న మొద‌టి టీ20లో ఆసిస్ బౌల‌ర్ల ధాటికి భార‌త్ 126 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆదిలోకే ఎదురు దెబ్బ త‌గిలింది. భారత్‌ ఆదిలోనే రోహిత్‌ శర్మ(5) వికెట్‌ను నష్టపోయింది. రోహిత్ త‌ర్వాత కెఎల్ రాహుల్ (50) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (24)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే వీరిద్దరూ 55 పరుగులు జోడించిన తర్వాత కోహ్లి(24) ఔటయ్యాడు. జంపా వేసిన 9వ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన కోహ్లీ కౌల్టర్‌నైల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

కోహ్లీ అవుట్ అయిన త‌ర్వాత భార‌త్ వికెట్లు ట‌ప‌ట‌పా ప‌డిపోయాయి. రిష‌బ్ పంత్ (3 ) వ‌ద్ద అన‌వ‌స‌ర‌మైన ప‌రుగుకు ప్ర‌య‌త్నించి ర‌నౌట్ అయ్యాడు. హాఫ్‌ సెంచరీ సాధించిన రాహుల్‌(50) ఔట్‌ కాగా మిగతా ఆటగాళ్లు దినేశ్‌ కార్తీక్‌(1), కృనాల్‌ పాండ్యా(1), ఉమేశ్‌ యాదవ్‌(2)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌ చేరారు. క్రీజ్‌లో ధోని(29 నాటౌట్‌) కడవరకూ ఉండటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ మూడు వికెట్లు సాధించగా, ఆడమ్‌ జంపా, ప్యాట్‌ కమిన్స్‌ బెహ్రన్‌డార్ఫ్‌లు తలో వికెట్‌ తీశారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -