Friday, April 26, 2024
- Advertisement -

సిడ్నీ టెస్టు: అతని చేతుల మీదుగా సైనీకి క్యాప్‌

- Advertisement -

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో చెరో విజయంతో సిరీస్‌ను సమం చేసిన ఆస్ట్రేలియా, భారత్‌ జట్లను వర్షం ఇబ్బందులు పెడుతోంది. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు వర్షం కారణంగా ఆలస్యమవగా.. వరుణుడి ప్రతాపంతో మరోసారి బ్రేకు పడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆతిథ్య జట్టు 7.1 ఓవర్లు ముగిసే సమయానికి ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ వికెట్‌ కోల్పోయి 21 పరుగులు చేసింది. వార్నర్‌(5) ను తక్కువ స్కోరుకే మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. పుజారాకు క్యాచ్‌ ఇచ్చి అతను వెనుదిరిగాడు.

కల నిజమైంది
హిట్‌మన్‌ రోహిత్‌ శర్మ జట్టులోకి రావడంతో టీమిండియా బ్యాటింగ్‌ బలం పెరిగింది. అతని రాకతో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌కు జట్టులో చోటు దక్కలేదు. గత మ్యాచ్‌లో గాయపడిన ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో నవదీప్‌ సైనీ జట్టులోకి వచ్చాడు. అతను భారత్‌ తరపున 299వ టెస్టు ఆటగాడిగా సైనీ అరంగ్రేటం చేశాడు. సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ సీనియర్‌ బౌలర్‌ బుమ్రా చేతుల మీదుగా టెస్ట్‌ జట్టు క్యాప్‌ను అతను అందుకుకున్నాడు. సైనీకి శుభాకాంక్షలు తెలుపుతూ బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అతని కల నిజమైందని పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా తరపున విల్‌ పకోవ్‌స్కీ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు.

భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టులో కొత్త ట్విస్ట్..!

నువు నిజంగా దేవుడివే అయ్యా!

మహేశ్ బాబుకు వదినగా రేణూ దేశాయ్!

బీజేపీ భారీ స్కెచ్.. త్వరలో కేసీఆర్‌కు భారీ షాక్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -