Saturday, April 20, 2024
- Advertisement -

ఆదిలోనే ఆసీస్‌కు షాక్‌…, కానీ

- Advertisement -

బ్రిస్బేన్‌: గాయాలతో కునారిల్లుతున్న టీమిండియాకు ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టుకు కీలక ఆటగాళ్లు బుమ్రా, విహారి, అశ్విన్‌ దూరమయ్యారు. వారి స్థానంలో నటరాజన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు అవకాశం లభించింది. శుక్రవారం ప్రారంభమైన గబ్బా టెస్టులో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆదిలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. డేవిడ్‌ వార్నర్‌ (1)ని సిరాజ్‌ ఔట్‌ చేయగా, పకోవ్‌స్కీ స్థానంలో జట్టులోకి వచ్చిన మార్కస్‌ హారిస్‌ (5)ను శార్దూల్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు. అయితే 17 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను స్టీవ్‌ స్మిత్‌ (36), లబుషేన్‌తో కలిసి నడిపించాడు.

స్మిత్‌ ప్రమాదకరంగా మారుతున్న సమయంలో అతన్ని వాషింగ్టన్‌ సుందర్‌ బోల్తా కొట్టించాడు. సుందర్‌ వేసిన 35 ఓవర్‌ బంతికి స్మిత్‌ ఔటయ్యాడు. సుందర్‌ ప్యాడ్ల పైకి వేసిన ఫుల్‌టాస్‌ డెలివరీని హిట్‌ చేయబోయిన స్మిత్‌.. షార్ట్‌ మిడ్‌ వికెట్‌గా ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇది సుందర్‌కు తొలి టెస్టు వికెట్‌. ఈ మ్యాచ్‌ ద్వారా సుందర్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. లంచ్‌ అనంతరం టీ విరామ సమయానికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 154 పరుగులతో ఉంది. లబుషేన్‌ (167 బంతుల్లో 73; 7 ఫోర్లు), మాథ్యూ వేడ్‌ (57 బంతుల్లో 27,1 ఫోర్‌) క్రీజులో ఉన్నారు.

ఒక్క డైలాగ్‌తో సినిమా హిట్!

రౌడీ బిహేవియ‌ర్‌.. కోహ్లి ఫైర్‌

భూమా అఖిలప్రియకి షాక్..చంచల్‌గూడ జైలే దిక్కు..!

జోరుగా కోడి పందాలు.. రంగంలోకి మహిళలు సైతం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -