Wednesday, May 8, 2024
- Advertisement -

అది జ‌రిగింటే కోహ్లీ గురించి మాట్లాడే వారు కాదు…అండ‌ర్స‌న్‌

- Advertisement -

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్‌ కోహ్లి చేసిన సెంచరీపై దిగ్గజాల సైతం ప్రశంసలు కురిపిస్తుంటే, ఇంగ్లిష్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ మాత్రం పెదవి విరుస్తున్నాడు. రెండో ఇన్నీంగ్స్‌లోనూ పోరాడుతున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కోహ్లి 43 పరుగులతో, దినేశ్ కార్తీక్ 18 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 84 పరుగులు అవసరం. కోహ్లి క్రీజ్‌లో ఉండటంతో భారత్ ధీమాగా ఉంది.

మా ఫీల్డర్లు పలుమార్లు స్లిప్‌లో క్యాచ్‌లు జారవిడిచిన కారణంగానే కోహ్లి శతకం నమోదు చేశాడని కొత్త పల్లవి అందుకున్నాడు. ఒకవేళ ఆదిలోనే కోహ్లి క్యాచ్‌ను అందుకుని ఉంటే అతని గురించి ప్రస్తుతం మాట్లాడుకునే అవకాశమే ఉండేది కాదని తన అక్కసును వెళ్లగక్కాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లి 21 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను విడిచిపెట్టడాన్ని అండర్సన్‌ ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

ఈ టెస్టులో ఒంటి చేత్తో భారత్‌ను కష్టాల నుంచి గట్టెక్కించిన కోహ్లిని అండర్సన్ మాటలతో కవ్వించే ప్రయత్నం చేశాడు. మూడో రోజు ఆట ముగిశాక మాట్లాడుతూ.. కోహ్లి అజేయుడేం కాదు, అతణ్ని ఔట్ చేస్తామన్నాడు. ‘తొలి ఇన్నింగ్స్‌లోలాగే టెయిలెండర్లతో మ్యాచ్‌ను కాచుకోవడానికి కోహ్లి ప్రయత్నిస్తాడు. అతణ్ని త్వరగా పెవిలియన్ చేర్చాలి. మొదటి ఇన్నింగ్స్‌లో ఆడినట్టే కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆడితే ఇండియా గెలుస్తుంది. సాధ్య‌మైనంత‌గా కోహ్లీనీ ఔట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు అండ‌ర్స‌న్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -