Thursday, April 25, 2024
- Advertisement -

నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన న్యూజిలాండ్‌…

- Advertisement -

భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. మొద‌ట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను ఆదిలోనె దొబ్బ కొట్టాడు భువ‌నేశ్వ‌ర్‌. తొలి టీ-20 మ్యాచ్‌లో భార‌త బౌలింగ్‌ను ఊచ‌కోత కోసిన ప్ర‌మాద‌క‌ర బ్యాట్స్‌మెన్ సీఫెర్ట్ (12) భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో కీప‌ర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ప‌దిహేను ప‌రుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది.

అనంత‌రం మ‌రో ఓపెన‌ర్ మున్రో (12) స్పిన్న‌ర్ కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం మ‌రికొద్ది సేప‌టికే మిచెల్ (1) కూడా కృనాల్ బౌలింగ్‌లో ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిర‌గాడు. దీంతో న్యూజిలాండ్ ప్ర‌స్తుతం 6 ఓవ‌ర్ల్లో 3 వికెట్లు కోల్పోయి 43 ప‌రుగులు చేసింది. అనంత‌రం కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎప్టెన్ విలియ‌మ్ స‌న్ 17 బంతుల్లో 20 ప‌రుగులు చేసి ఎల్‌బీగా వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో టైల‌ర్‌, గ్రాండ్ హోమ్ ఉన్నారు. ప్ర‌స్తుతం 9 ఓవ‌ర్ల‌కు 55/4 తో ఆడుతోంది.

గత బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఓడిన భారత్ జట్టుకి.. ఈ మూడు టీ20ల సిరీస్‌‌లో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ఇటీవల సొంతగడ్డపై 1-4 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఈరోజు మ్యాచ్‌లో గెలవడం ద్వారా 2-0తో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -