Saturday, April 27, 2024
- Advertisement -

నరాలు తెగే ఉత్కంఠ.. చివర్లో చిరస్మరణీయ విజయం

- Advertisement -

ఆసియా కప్ లో భాగంగా దాయాది జట్లు అయిన భారత్ పాకిస్తాన్ మద్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేధికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాక్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో చేధించి విజయఢంఖా మోగించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్.. భారత భౌలర్ల ధాటికి కుదేలు అయ్యారు. ఏ ధశలోనూ భారీ స్కోర్ కు అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు కట్టడి చేయడంతో తక్కువ స్కోర్ తోనే వెనుదిరిగారు పాక్ బ్యాట్స్ మెన్. మహ్మద్ రిజ్వన్ 42 బంతుల్లో 43 పరుగులు చేసి కాస్త మెరుగైన ప్రదర్శన చేయగా, అహ్మద్ 22 బంతుల్లో 28 పరుగులు, బాబర్ ఆజమ్ 9 బంతుల్లో 10 పరుగులు, ఫఃకర్ జమన్ 6 బంతుల్లో 10 పరుగులతో మాత్రమే రాణించగా మిగతా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు..

భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు, హర్డిక్ పాండ్య 3 వికెట్లు, హర్షదీప్ 2 వికెట్లు, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ తీసి.. పాక్ పతనానికి నాంది పలికారు. ఇక తక్కువ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలుపు కోసం చెమటోచాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిత్ శర్మ 18 బంతుల్లో 12 పరుగులు చేసి వెనుదిరగగా, మరో ఓపెనర్ కే‌ఎల్ రాహుల్ ఖాతనే తెరకుండా డక్ ఔట్ గా నిలిచాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టుకు కాస్త ఉపశమనం ఇచ్చాడు. ఇక రవీంద్ర జడేజా 29 బంతుల్లో 35 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 18 పరుగులు చేశారు.. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది.

ఆఖరి ఓవర్లో విజయనికి 7 పరుగులు అవసరం కాగా అల్ రౌండర్ హర్డిక్ పాండ్య ఎలాంటి ఒత్తిడి లేకుండా జట్టుకు విజయాన్ని అంధించాడు. మొత్తంగా హర్ధిక్ పాండ్య 17 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ విజయంతో గత టి20 వరల్డ్ కప్ లో ఎదురైన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో.. అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -