Friday, May 10, 2024
- Advertisement -

స‌మంచేస్తారా ….చేతులెత్తేస్తారా…..?

- Advertisement -

శ్రీలంక‌తో ఆడుతున్న మూడు వ‌న్డేల సిరీస్‌లో మొద‌టి వ‌న్డేలో భార‌త్ ఘ‌రంగా ఓడింది. లంక బౌల‌ర్ల‌ముందు టాప్ బ్యాట్స్‌మేన్‌లంద‌రూ త‌లొంచారు. తొలి వన్డేలో ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మతో సహా టాపార్డర్‌ ఘోరంగా విఫలమైంది. ఒక్క ధోని హాఫ్‌ సెంచరీ మినహా భారత జట్టులో ఎవరూ కనీస ప్రదర్శన చేయలేదు. ఏ దశలోనూ లంక బౌలింగ్‌కు బదులివ్వకపోవడంతో టీమిండియా వంద పరుగుల్ని దాటడానికి అపసోపాలు పడింది.

రెండో వ‌న్డే బుధ‌వారం మొహాలీలో జ‌ర‌గ‌నుంది. రెండో వ‌న్డే భార‌త్‌కు కీల‌కం. వ‌న్డే గెలుస్తేనే సిరీస్‌పై భార‌త్ ఆశ‌లు స‌జీవంగా ఉంటాయి. ఈ మ్యాచ్ గెలిచి స‌మం చేయాల‌ని భార‌త్‌….మ‌రో వైపు మొద‌టి వ‌న్డేలో విజ‌యం సాధించిన విజ‌యంతో రెట్టించి ఉత్సాహంతో లంక బ‌రిలోకి దిగుతోంది.

మొహాలీ పిచ్‌ కూడా ధర్మశాల పిచ్‌ తరహాలోనే ఉండనుందని అంచనా వేస్తున్నారు. అయితే పిచ్‌పై పచ్చికను తొలగించి పూర్తిగా పేస్‌ బౌలింగ్‌ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌కు కూడా అనుకూలంగా ఉండేలా తయారు చేశారని సమాచారం. ఇక్కడ అత్యధిక స్కోరు 351/5 కాగా, అత్యల్ప స్కోరు 89/10. మరొకవైపు ఛేదనలో అత్యధిక స్కోరు 322/6. దాంతో పిచ్‌ను అంచనా వేయడం కష్టంగా మారింది.

గ‌త ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. కాగా, ఇప్పుడు బలహీన జట్టుగా భావించిన శ్రీలంకతో తొలి వన్డేలో ఎదురైన ఓటమితో భారత జట్టు డీలా పడింది. ధర్మశాల వేదికగా జరిగిన మొదటి వన్డేలో బ్యాటింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసిన టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. దాంతో భారత్‌ జట్టుకు రెండో వన్డేలో గెలుపు అనివార్యం. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే భారత్‌ జట్టు సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానిపక్షంలో ఇంకా మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ను సమర్పించుకోవాల్సి ఉంటుంది.

మొద‌టి వ‌న్డేలో టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌లం అయ్యింది. ధోని ఆమాత్రం స్కోరు చేయక‌పోయింటే అత్తంత చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టీమిండియా రెండో వన్డేలో ఆడితేనే గెలుపుకు బాటలు వేసుకోవచ్చు. ప్రధానంగా టాపార్డర్‌ రాణిస్తేనే లంకను నిలువరించిడం సాధ్యమవుతుంది. మరొకవైపు సంచలనాలకు మారుపేరైన లంకేయులతో అత్యంత జాగ్రత్త ఉండటం అవసరం. ఆ జట్టును ‘పసికూన’గా భావించకుండా ఒళ్లు దగ్గర పెట్టుకునే భారత జట్టు సమష్టి ప్రదర్శన చేయాలి. అలా అయితేనే టీమిండియా విజయాన్ని అందుకుంటుది. మరి రేపు జరిగే మ్యాచ్‌లో భారత్‌ జట్టు గెలిచి సిరీస్‌ను సమం చేస్తుందా.. లేక ఓడి సిరీస్‌ను సమర్పించుకుంటందా? చూడాలి.

తుది జట్లు అంచనా

భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానే, దినేశ్‌ కార్తీక్‌, మనీష్‌ పాండే, ఎంఎస్‌ ధోని, హార్దిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌ యాదవ్‌, బూమ్రా, యజ్వేంద్ర చాహల్‌

శ్రీలంక:తిషారా పెరీరా(కెప్టెన్‌), దనుష్క గుణతిలకా, ఉపుల్‌ తరంగా, లహిరు తిరుమన్నే,ఏంజెలో మాథ్యూస్‌, డిక్వెల్లా, అసెలే గుణరత్నే, సచిత్‌ పతిరన, సురంగా లక్మల్‌, అకిలా ధనంజయ, నువాన్‌ ప్రదీప్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -