కోహ్లీ భయం అంటే ఏంటో తెలియదట : లాయిడ్

- Advertisement -

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ ప్రశంసలు చేశాడు. కోహ్లీకి అసలు భయం అంటే తెలియదని.. వ్యక్తిగత రికార్డులకంటే టీమిండియా గెలుపు కోసమే కోహ్లీ అధిక ప్రాధాన్యత ఇస్తాడని లాయిడ్ అన్నారు. కోహ్లీ గొప్ప నాయకుడని.. టీమిండియాకు కెఫ్టెన్ గా గంగూలీ దూకుడు నేర్పితే.. దానిని కోహ్లీ మరో స్థాయికి తీసుకెళ్లాడని లాయిడ్ అన్నారు.

2017 నుంచి భారత్ జట్టు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కానీ.. అతని కెప్టెన్సీలో టీమిండియా 55 టెస్టులాడి ఏకంగా 33 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్ తరపున టెస్టుల్లో కెఫ్టెన్సీ పరంగా ఇదే బెస్ట్ రికార్డ్. “భారత క్రికెట్ పై గంగూలీ చెరగని ముద్ర వేయగా.. కోహ్లీ దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. అతను మంచి నాయకుడు అలానే మంచి బ్యాట్స్ మెన్. అతను పరుగులకంటే మ్యాచ్ లో టీమిండియా గెలుపు కోసమే అతను ప్రాధాన్యత ఉంటుంది. అతను ఎవరికి అసలు భయపడడు” అని డేవిడ్ లాయిడ్ వెల్లడించాడు.

- Advertisement -

ఇప్పటికే వన్డే, టెస్టుల్లో కలిపి 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 శతకాల రికార్డ్‌ని బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక ఆటగాడిగా ముందుకు సాగుతున్నాడు. కెప్టెన్‌గానూ ఆస్ట్రేలియా గడ్డపై 2018-19లో టెస్టు సిరీస్‌ గెలిచిన ఏకైక భారత కెఫ్టెన్ గా అరుదైన రికార్డు సాధించాడు.

రోహిత్‌ ఈజీగా డబుల్ సెంచరీ చేయడానికి కారణం ఇదే..!

ఐపీఎల్ 2020 తర్వాత రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన హర్భజన్..!

రోహిత్ శర్మని ఔట్ చేయడం నా కల : పాక్ ఫేసర్

సర్వేలో గంగూలీని ఓడించిన ధోనీ.. ఎంత తేడాతో అంటే ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -