Monday, May 6, 2024
- Advertisement -

” జి” గేల్ రాజ‌ లేక‌పోయినా ఢిల్లీపై అనూహ్య‌ విజ‌యం సాధించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌..

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ త‌న జోరును కొనసాగిస్తోంది . ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో సోమవారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ 4 పరుగుల తేడాతో గెలుపొందింది. సునీమీ గేల్ లేక‌పోయినా పంజాబ్ అద్భుత విజ‌యం సాధించింది.

ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో విజ‌యానికి ఢిల్లీ జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన దశలో ఒక సిక్స్, ఫోర్ బాదిన శ్రేయాస్ అయ్యర్ (57: 45 బంతుల్లో 5×4, 1×6) మ్యాచ్‌ని ఉత్కంఠగా మార్చేశాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాల్సిరాగా. పంజాబ్ యువ స్పిన్నర్ ముజీబ్ తెలివైన బంతితో శ్రేయాస్‌ని ఔట్ చేసి.. జట్టుని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. సిక్స్ కోసం ప్రయత్నించిన శ్రేయాస్ బౌండరీ లైన్‌కి సమీపంలో ఫీల్డర్ అరోన్ ఫించ్ చేతికి చిక్కాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్‌ రాహుల్‌(23), మయాంక్‌ అగర్వాల్‌(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్‌ స్థానంలో వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌(26) కూడా విఫలమయ్యాడు.

ల‌క్ష్య‌ఛేద‌న‌లోకి దిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్ పృథ్వీ షా (22: 10 బంతుల్లో 4×4) ఔటవగా.. జట్టు స్కోరు 41 వద్ద హిట్టర్ మాక్స్‌వెల్ (12: 10 బంతుల్లో 1×4, 1×6), 42 వద్ద కెప్టెన్ గౌతమ్ గంభీర్ (4: 13 బంతుల్లో) పేలవ రీతిలో ఔటవడంతో.. ఢిల్లీ 42/3తో ఒత్తిడిలో పడింది. ఈ దశలో శ్రేయాస్ అయ్యర్ క్రీజులో పాతుకుపోయి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఒక ఎండ్‌లో వరుసగా రిషబ్ పంత్ (4), క్రిస్టియాన్ (6) ఔటైనా.. పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. చివర్లో అతనికి రాహుల్ తెవాటియా (24: 21 బంతుల్లో 1×4, 1×6) చక్కటి సహకారం అందించాడు. అయితే.. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన ఆండ్రూ టై అతడ్ని ఔట్ చేసి.. శ్రేయాస్‌పై ఒత్తిడి పెంచాడు. ఆఖర్లో 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన దశలో బంతిని అందుకున్న బరిందర్ శరణ్ కేవలం 4 పరుగులిచ్చి ఫ్లంకెట్ (0) వికెట్ పడగొట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్‌ పంజాబ్‌వైపు మొగ్గింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -