Monday, April 29, 2024
- Advertisement -

దేశంలో లాక్ డౌన్ కొనసాగింపు టెన్షన్..?

- Advertisement -

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తల్లడిల్లిపోతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే వారాంతపు లాక్ డౌన్ లు, నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నాయి.

పాక్షిక లాక్ డౌన్ ను అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ఇంకా కేసులు తగ్గక పోవడంతో పలు రాష్ట్రాలు నిబంధనల అమలు సమయాన్ని పొడిగించే యోచనగా అడుగులు వేస్తున్నాయి. . తాజాగా, ఒక రోజు వ్యవధిలో 24 వేలకు పైగా కొత్త కేసులు రావడంతో పాటు టెస్ట్ పాజిటివిటీ రేటు 32.27కు పెరగడం, 257 మంది మరణించడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూ ఇప్పటికే నాలుగవ రోజుకు చేరింది.

ఈ నెల 30తో నైట్ కర్ఫ్యూ ముగియాల్సి వుండగా, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిబంధనల అమలును పొడిగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏపీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.

అయితే కర్ఫ్యూ, పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కట్టుదిట్టం చేయలేకపోతుంటే కొన్ని రోజులు సంపూర్ణ లాక్ డౌన్ యోచన చేయడంలో అతిశయోక్తి లేదని అంటున్నారు. లాక్ డౌన్ తట్టుకునే పరిస్థితిలో ప్రజలు ఉన్నారా.. అంటే కష్టమే.. అందుకే కరోనాని కట్టడి చేయడమే మన చేతిలో ఉన్న ఆయుధం అంటున్నారు.

ఆడపిల్ల పుట్టిందని ఏకంగా హెలికాప్టర్ లోనే ఇంటికి తీసుకు వచ్చారు!

జస్టిస్ రమణకు సెలబ్రెటీల అభినందనలు..

కాంగ్రెస్ ఎంఎల్ఎ కళావతి కరోనాతో మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -