Thursday, April 25, 2024
- Advertisement -

మిస్టర్‌ కూల్‌ ధోనీ చరిత్ర సృష్టించాడు.

- Advertisement -

టీమిండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చిన మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ను గొప్ప స్థానంలో నిలిపాడు. అతని సారధ్యంలో మూడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది నాలుగు సార్లు రన్నరప్ గా నిలిచింది. అంతటి సత్తా ఉన్న కెప్టెన్ కు చెన్నై యాజమాన్యం కూడా భారీగానే చెల్లిస్తోంది. తాజాగా ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రూ.150 కోట్లను ఆర్జించిన తొలి క్రికెటర్‌గా (స్వదేశీ లేదా విదేశీ) మిస్టర్‌ కూల్‌ ధోనీ చరిత్ర సృష్టించాడు.

ఐపీఎల్ మొదలైన 2008 నుంచి చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ధోని.. 2020 వరకు ఆడిన లీగ్‌ల ద్వారా 137 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాడు. ఐపీఎల్ 2021 సీజన్‌కు కూడా చెన్నై ఫ్రాంచైజీ కెప్టెన్ ధోనికి రూ.15 కోట్లు చెల్లించనుంది. దీంతో ధోని మొత్తం సంపాదన రూ.152 కోట్లకు చేరింది. ఈ లెక్కలతో రూ.150 కోట్ల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా ధోని నిలిచాడు. ధోని తర్వాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రూ.146.6 కోట్లతో రెండో స్థానంలో, రూ.143 కోట్లతో బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

క్షమాపణలు చెప్పిన చల్లా ధర్మారెడ్డి!

ఇంగ్లండ్ ఓట‌మి ఖాయం: మాజీ క్రికెట‌ర్

బ్రహ్మానందం ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

ఊహించని ఆఫర్‌ కొట్టేసిన మోనాల్‌ గజ్జర్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -