Thursday, May 9, 2024
- Advertisement -

అంపైర్ల త‌ప్పిదం.. కోహ్లీ సేన ఖాతాలో మ‌రో ఓట‌మి

- Advertisement -

ఐపీఎల్ 12వ‌ సీజన్‌లో కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు క‌లిసి రావ‌డం లేదు. ఈ సీజ‌న్‌లో జ‌ట్టు వ‌రుస‌గా రెండో ఓట‌మిని మూట‌గ‌ట్టుకుంది. ఈసారి త‌మ ప్ర‌మేయం లేకుండానే ఆ జట్టు ఓట‌మిని చ‌విచూసింది. అంపైర్లు చేసిన త‌ప్పు వ‌ల్ల సీజ‌న్‌లో రెండో మ్యాచ్‌లో కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఓడిపోయింది. పూర్తి వివ‌రాల్లోకి వేళ్తే…గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ముంబై ఇండియన్స్‌తో ఆడింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 187 పరుగులు చేసింది. త‌ల‌ప‌డింది.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ( 48) ,సూర్యకుమార్‌ యాదవ్‌ (38) రాణించారు.చివ‌ర్లో హార్దిక్‌ పాండ్యా (14 బంతుల్లో 32 నాటౌట్) పరుగుల‌తో చెలరేగిపోయారు. మ‌న సిక్స‌ర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ ( 23) వ‌రుస‌గా మూడు సిక్స్‌ల‌తో అభిమానుల‌ను అల‌రించాడు. . అనంతరం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులే చేయగలిగింది. ఏబీ డివిలియర్స్‌ (70 ) పోరాటం జట్టును గెలిపించలేకపోయింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ( 46) ప‌రుగులు చేశాడు. విజ‌యం దిశాగా వెళ్తున్న బెంగళూరు టీమ్‌కు అంపైర్ త‌ప్పిదం శాపంగా మారింది. చివ‌రి ఓవ‌ర్లో 17 ప‌రుగులు అవ‌స‌రం కాగా 12 ప‌రుగులు మాత్ర‌మే చేశారు.

మ‌లింగ వేసిన ఈ ఓవ‌ర్ చివ‌రి బంతి నో బాల్ అయిన‌ప్ప‌టికి అంపైర్ అది గ‌మ‌నించ‌కపోవ‌డంతో ముంబై ఇండియన్స్ విజ‌యం సాధించింది. అనంత‌రం రీప్లైలో ఇది నో బాల్‌గా తెలిన‌ప్ప‌టికి ,అప్ప‌టికే మ్యాచ్ ముగిసిపోయింది. ఈ నిర్ణ‌యంపై రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.మేం ఐపీఎల్‌ ఆడుతున్నాం. క్లబ్‌ స్థాయి క్రికెట్‌ కాదు. ఆఖరి బంతిని నోబాల్‌గా ప్రకటించకపోవటం దుర్మార్గం. ఏకంగా అంగుళం తేడాతో అడుగు పడింది. అంపైర్లు కళ్లు మూసుకున్నారా! ఇలాంటి చిన్న విషయాలే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వాళ్లు మరింత జాగ్రత్తగా, చురుగ్గా ఉండాల్సింది’
– కోహ్లి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -