Saturday, May 11, 2024
- Advertisement -

టీ 20 ల్లో రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డ్‌….

- Advertisement -

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కొత్త రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ 61 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే ఒక రికార్డును రోహిత్‌ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ 20ల్లో భారత్‌ తరపున అత్యధిక సిక‍్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ శర్మ రికార్డు నెలకొల్పాడు.

ప్రస్తుతం రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ 20ల్లో 75 సిక్సర్లు సాధించి భారత ఆటగాళ్ల జాబితాలో తొలి స్థానాన్ని ఆక్రమించాడు. ఇక్కడ యువరాజ్‌ సింగ్‌ను(74 సిక్సర్లు) రోహిత్‌ అధిగమించాడు. ఈ మ్యాచ్‌కు ముందు 70 సిక్సర్లతో ఉన్న రోహిత్‌.. బంగ్లాదేశ్‌పై బౌండరీల వర్షం కురిపించాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వారిలో క్రిస్‌ గేల్‌, గప్టిల్‌(103) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.

మరొకవైపు భారత్‌ తరఫున టి20 మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన పిన్న వయస్సు బౌలర్‌గా సుందర్‌ (18 ఏళ్ల 160 రోజులు) గుర్తింపు పొందాడు. అక్షర్‌ పటేల్‌ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉన్న రికార్డు తెరమరుగైంది.

ఇదే మ్యాచ్ లో ఒక టీ20లో మూడు వికెట్లు తీసిన పిన్న వయసు భారతీయ బౌలర్‌ రికార్డును వాషింగ్టన్ సుందర్‌ (18 ఏళ్ల 160 రోజులు) సవరించాడు. గతంలో ఈ రికార్డు అక్షర్‌ పటేల్‌ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉండగా, దానిని సుందర్ సవరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -