Friday, May 10, 2024
- Advertisement -

లంక‌తో స‌మ‌రానికి సిద్ద‌మైన టీమిండియా … గెలిచి బ‌దులు తీర్చుకుంటారా..?

- Advertisement -

ముక్కోణపు టీ20 సిరీస్‌లో లంక‌తో తేల్చుకొనేంద‌కు భార‌త్ సిద్ధ‌మ‌య్యింది. ఫైన‌ల్ వెల్లాలంటే లంక‌తో జ‌రిగే మ్యాచ్‌లో క‌శ్చితంగా గెల‌వాల్సిందే. ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన భార‌త్ ఆదిలోనే ఎవ‌రూ ఊహించ‌ని ప‌రాజ‌యం ఎదురైంది. గత మంగళవారం రాత్రి జరిగిన తొలి మ్యాచ్‌లోనే శ్రీలంక జట్టు అలవోకగా 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టీమిండియాని దెబ్బతీసింది.

తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పుంజుకున్న భారత్ టోర్నీలో బోణీకొట్టినప్పటికీ శ్రీలంకపై ప్రతీకారం మాత్రం అలానే మిగిలిపోయింది. సోమవారం రాత్రి 7 గంటలకి భారత జట్టు టోర్నీలో శ్రీలంకతో రెండోసారి ఢీకొట్టబోతోంది

శ్రీలంకపై అసాధారణ రికార్డులు నెలకొల్పిన కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్‌లోనే పేలవరీతిలో డకౌటయ్యాడు. దీంతో.. ఈ ఓపెనర్‌ నుంచి భారత్ జట్టు మెరుపు ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు బాది సూపర్ ఫామ్‌లో ఉండగా.. సురేశ్ రైనా, మనీశ్ పాండే తమ వంతుగా మిడిలార్డర్‌లో సత్తాచాటుతున్నారు. జూనియర్ ధోనీగా అభిమానులతో ముద్దుగా పిలిపించుకుంటున్న రిషబ్ పంత్.. ఇంకా తనదైన ఇన్నింగ్స్ ఆడలేదు. మైదానంలో అతను ఎలాంటి ఒత్తిడి లేకుండా కనిపిస్తున్నప్పటికీ.. షాట్ల ఎంపికలో తడబడుతున్నాడు.

ఫాస్ట్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, జయశంకర్ మాత్రమే ఫర్వాలేదనపిస్తున్నారు. శార్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ధారాళంగా పరుగులిస్తున్నారు. మరోసారి.. స్పిన్నర్ చాహల్ కీలకం కానున్నాడు. బౌలింగ్‌ విభాగం కూడా కెప్టెన్‌ ఫామ్‌లాగే టీమ్‌ మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెంచుతోంది. ఉనాద్కట్‌ గత మ్యాచ్‌లో 3 వికెట్లు తీసినప్పటికీ తొలిపోరులో చేతులెత్తేశాడు. చహల్‌ మ్యాజిక్‌ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌ బంగ్లాపై రెండు వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. అయితే సమష్టిగా రాణిస్తేనే భారీస్కోర్లు చేస్తున్న శ్రీలంకను నిలువరించగలం. లేదంటే తొలి మ్యాచ్‌ ఫలితం పునరావృతమయ్యే అవకాశముంది.

బంగ్లాదేశ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 214 పరుగుల లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేకపోయిన శ్రీలంక.. ప్రస్తుతం సొంతగడ్డపై కొంచెం ఒత్తిడిలోనే బరిలోకి దిగుతోంది. అయితే.. ఒక ఓవర్ వ్యవధిలోనే మ్యాచ్ స్వరూపం మారిపోయే ఈ టీ20ల్లో ఏ జట్టుకైనా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్, సురేశ్‌ రైనా, రాహుల్‌/రిషభ్‌ పంత్, మనీశ్‌పాండే, దినేశ్‌ కార్తీక్, వాషింగ్టన్‌ సుందర్, చహల్, విజయ్‌ శంకర్, శార్దుల్‌ ఠాకూర్, ఉనాద్కట్‌.

శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), లక్మల్, తరంగ, గుణతిలక, కుశాల్‌ మెండిస్, షనక, కుశాల్‌ పెరీరా, జీవన్‌ మెండిస్, నువాన్‌ ప్రదీప్, చమీర, ధనంజయ డిసిల్వా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -