సరైన సమయంలో తప్పుకోవడం నాయకత్వ లక్షణం

- Advertisement -

భారత క్రికెట్ లోని అన్ని పార్మాట్లకు కెప్టెనాగా తప్పుకున్న విరాట్ కోహ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. బీసీసీఐతో ఉన్న విభేదాల కారణంగానే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పలు సందర్భాల్లో వెల్లడైంది. కాగా ఇండియన్ క్రికెట్ ను ప్రపంచంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడంలో కోహ్లి ఎంతో క్రుషి చేశారు.

కెప్టెన్నీ నుంచి తప్పుకున్న కోహ్లికి పలువురు సీనియర్లు మద్దతు తెలుపుతున్నారు. కెప్టెన్నీ నుంచి తప్పుకున్నాక తొలిసారి విరాట్ ఈ విషయంపై స్పందించాడు. తనకు ఎటువంటి బాధ్యతలు లేకున్నా ఒక సాధారణ ఆటగాడిగా ఎంతో చేయగలను అని చెప్పాడు.

తానుతీసుకున్న నిర్ణయం సరైనదే అని చెప్పాడు. ‘గతంలో నా కన్నా ముందు మహేంద్ర్ సింగ్ ధోని కూడా ఇలాగే చేశాడు. తను నాకు బాధ్యతలు అప్పగించి .. ఒక సాధారణ సభ్యుడిగా జట్టులో కొనసాగాడు. అతను తన సలహాలు సూచనలు ఇస్తూనే ఉన్నాడు. నేను అదే చేస్తాను. ప్రతి దానికి ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. సరైన సమయంలో తప్పుకోవడం కూడా నాయకత్వ లక్షణమే అవుతుంది. ఒక బ్యాట్స్ మెన్ గా మరింత ఎక్కువగా పని చేయగలను’అని వివరించాడు కోహ్లి.

ప్రపంచక‌ప్‌లో భూకంపం

క్రికెట్ వెన్నెముకను విరిచేస్తారా ..

భారత క్రికెట్ ను తలదించుకునేలా చేయకండి

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -