Friday, April 26, 2024
- Advertisement -

ధోనీతో నన్ను పోల్చడం నాకు నచ్చలేదు : రోహిత్ శర్మ

- Advertisement -

ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీతో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను పోల్చుతూ సురేశ్‌ రైనా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ‘మేము బంగ్లాదేశ్‌లో ఆసియా కప్ గెలిచినప్పుడు నేను రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడాను. అప్పుడు రోహిత్ ను దగ్గర గమనించాను. యువ ఆటగాళ్లపై అతడు ఎలా విశ్వాసం చూపుతాడో నేను చూశాను.

నాకు తెలిసి టీమిండియా తదుపరి ధోనీ ఎవరైనా ఉన్నారా అంటే రోహిత్‌ పేరే చెబుతాను. మహీలాగే రోహిత్ కూడా సానుకూల దృక్పథంతో ఉంటాడు. అతను సమస్యలు పరిష్కరించే తీరు గమనించాను. అందుకే నా పుస్తకంలో వారిద్దరిని అద్భుతమైన వ్యక్తులుగా అభివర్ణించాను’ అని రైనా చెప్పుకొచ్చాడు. అయితే రైనా చేసిన కామెంట్స్ పై తాజాగా రోహిత్ శర్మ స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. “రైనా కామెంట్స్‌ విన్నాను. ధోనీతో నన్ను పోల్చాడు. ధోనీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అతనిలా ఎవ్వరూ ఉండలేరు. ప్రతీ మనిషి యొక్క గుణగణాలు సెపరేట్‌గా ఉంటాయి. అలానే ప్రతి ఒక్కరికి ఒక్కో లక్షణం, వ్యక్తిత్వం ఉంటాయి. రైనా చేసిన పోలిక సరైనది కాదు. నేను ఎప్పుడూ పోలికల్ని ఇష్టపడను. ప్రతీ ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది.

అలానే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి’ అని పేర్కొన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో రైనా ఇప్పటివరకు 18 టెస్టుల్లో, 226 వన్డేల్లో, 78 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు రోహిత్ 32 టెస్టుల్లో, 224 వన్డేల్లో, 108 టీ20 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

ముంబై ఇండియన్స్ కి షాక్.. మలింగ లేడు.. ఎందుకంటే ?

టీమిండియా తదుపరి ధోనీ రోహితే : రైనా

రిషబ్ పంత్‌ రాణించాలంటే కోహ్లీ ఇలా చేయాలి : పఠాన్

సెహ్వాగ్‌ లాగా రోహిత్ రాణించగలడా ? సందేహమే : ఇర్ఫాన్ పఠాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -