Saturday, April 27, 2024
- Advertisement -

టీమిండియా దూకుడు.. రోహిత్ రికార్డ్ ..!

- Advertisement -

ఇంగ్లండ్ తో జరుగుతున్నా మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్ లలోనూ విజయాలు సాధించి, మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.. ఇక టెస్ట్ సిరీస్ ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా దెబ్బకు దెబ్బ తీస్తూ టి20 ను కైవసం చేసుకుంది. ఇక ఇవాళ జరిగే చివరి టి20 మ్యాచ్ లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంటే.. చివరి మ్యాచ్ లోనైనా విజయం సాధించి సొంత దేశంలో పరువు నిలుపుకోవాలని భావిస్తోంది ఇంగ్లాండ్. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ముఖ్యంగా టి20 సిరీస్ లలో దూసుకుపోతోంది. వరుస విజయాలతో క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్నీ విభాగాలలో కూడా టీమిండియా పటిష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ, రిషబ్ పంత్ మంచి ఫామ్ లో ఉన్నట్లే కనిపిస్తున్నారు. ఇక విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ లోకి వస్తే జట్టు బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టంగా మరే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, బుమ్రా కూడా అదరగొడుతున్నారు. ఇదే ఫామ్ కొనసాగితే ఇంగ్లండ్ ను క్లీన్ స్వీఫ్ చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు.. ఇక బర్మింగ్ హామ్ వేదిక గా ఇంగ్లండ్ తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. టి20 లలో 300 ఫోర్లు కొట్టిన మొదటి భారత బ్యాట్స్ మెన్ గా హిట్ మ్యాన్ రికార్డ్ సృష్టించాడు. ప్రపంచం మొత్తం మీద చూసినట్లైతే .. ఐర్లాండ్ స్టార్ ప్లేయర్ పాల్ స్టీర్లింగ్ 325 ఫోర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తరువాత 301 ఫోర్లతో రోహిత్ శర్మ రెండవ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -