గంగూలీ బయోపిక్‌లో నటించే హీరో ఎవరంటే ?

- Advertisement -

ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రధానంగా క్రీడా రంగంకు సంబంధించిన సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీల మీద వచ్చిన బయోపిక్స్ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మేరీకోమ్, భాగ్ మిల్కా భాగ్, దంగల్ లాంటి క్రీడా నేపథ్య చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించాయి.

ఈ నేపథ్యంలో తాజాగా మరో బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ బయోపిక్‌ కూడా త్వరలో తెరకెక్కనుంది. తాప్సీ పొన్ను టైటిల్‌ పాత్రలో కనిపించబోతుంది. ఇక భారత మాజీ కెఫ్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవలే గంగూలీ ఓ టాక్ షోలో పాల్గొన్నారు.

- Advertisement -

’ఒకవేళ మీ బయోపిక్ వస్తే.. అందులో ఏ హీరో నటించాలని అనుకుంటున్నారు’ అన్న ప్రశనకు ’హృతిక్ రోషన్. నేను అతని ఎక్కువ ఇష్టపడుతా’ అని గంగూలీ జవాబు ఇచ్చారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గంగూలీ పాత్రకు హృతిక్ రోషన్ సరిపోతాడని క్రీడా అభిమానులు కూడా అంటున్నారు.

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -