Saturday, April 27, 2024
- Advertisement -

ధోనీ స్థానం రిష‌బ్‌పంత్‌కే ఇవ్వండి…మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్‌

- Advertisement -

ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్‌ జట్టు ఆదివారం శ్రీలంక బయల్దేరి వెళ్లింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్‌… శ్రీలంకతో తలపడనుంది. మూడు జట్లు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫైనల్‌ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే వేదిక కానుంది. అయితే టీంలో సీనియ‌ర్ల‌కు విశ్రాంతినిచ్చి జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను తీసుకున్నారు.

ప్ర‌ధానంగా వికెట్‌కీప‌ర్ ధోనీ స్థానమే ఇప్పుడు ప్ర‌ధాన‌మైన‌ది. భారత టీ20 జట్టులోకి మళ్లీ పునరాగమనం చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి ధోనీ స్థానంలో ఎక్కువ అవకాశాలివ్వాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. శ్రీలంక వేదికగా మంగళవారం నుంచి ముక్కోణపు టీ20 టోర్నీ జరగనుండగా.. ఇటీవల జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లు ధోనీకి విశ్రాంతినిచ్చి అతని స్థానంలో దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌కి అవకాశమిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ టోర్నీలో వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్ ఉంటాడని.. రిషబ్ పంత్‌ను కేవలం బ్యాట్స్‌‌మెన్‌గా మాత్రమే ఎంపిక చేసినట్లు సెలక్టర్లు చెప్తున్నారు.

‘వన్డే, టీ20ల్లో మహేంద్రసింగ్ ధోని, టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా.. ఈ ఇద్దరిలో ఎవరు గాయడినా వారికి ప్రత్యామ్నాయంగా దినేశ్ కార్తీక్ (వన్డే, టీ20), పార్థీవ్ పటేల్(టెస్టులు) అవకాశం దక్కించుకుంటున్నారు. కానీ.. భారత జట్టుకి త్వరలోనే ఓ నైపుణ్యం కలిగిన వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్ కావాలి. అందుకే కార్తీక్, పార్థీవ్‌కు అవకాశం ఇవ్వడం కంటే.. యువ క్రికెటర్ రిషబ్‌కి ఎక్కువ ఛాన్సిలివ్వడం ద్వారా భారత్ అతడ్ని తయారు చేసుకోవాలి.

ఇందులో భాగంగా ముక్కోణపు టీ20 టోర్నీ మొత్తం అతడ్ని ధోనీ స్థానంలో అంటే.. వికెట్ కీపర్/ బ్యాట్స్‌మెన్‌గా ఆడించాలి’ అని మంజ్రేకర్ సూచించాడు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. కోహ్లి, ధోని, హార్దిక్ పాండ్య, బుమ్రా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్‌కి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -