Thursday, May 2, 2024
- Advertisement -

టాస్ గెలిచి భార‌త్ పై బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక‌..భారత్ జట్టులో మార్పులు

- Advertisement -

ప్రపంచకప్‌లో శనివారం భారత్, శ్రీలంక మధ్య ఆసక్తికర సమరం కాసేప‌ట్లో ఆరంభం కానుంది. టాస్ గెలిచి లంక మొద‌ట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు జ‌ట్ల‌లోను మార్పులు చోటు చేసుకున్నాయి. వాండర్‌సే స్థానంలో తిసార పెరీరాను తుదిజట్టుకు ఎంపిక చేసినట్లు కరుణరత్నె చెప్పాడు. మరోవైపు భారత్ జట్టులో కూడా రెండు మార్పులు చేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీలకు విశ్రాంతినిచ్చి.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు అవకాశమిచ్చినట్లు వివరించాడు.

పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీసేన..ఈ లీగ్‌ మ్యాచ్‌ను విజయంతో ముగించాలని చూస్తోంది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన శ్రీలంక చివరి మ్యాచ్‌లో గెలుపొందాలన్న పట్టుదలతో ఉంది. మ‌రో వైపు భార‌త్ గెలిచి పాయంట్ల ప‌ట్టిక‌లో మొద‌టి స్థానంపై గురిపెట్టింది.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ(కెప్టెన్‌), రిషభ్‌పంత్‌, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రిత్‌బుమ్రా,

శ్రీలంక జట్టు: దిముత్‌ కరుణరత్నే(కెప్టెన్‌), కుశాల్‌పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ మెండిస్‌,థిసారా పెరీరా, లాహిరు తిరుమన్నె, ఏంజిలో మాథ్యూస్‌, ధనంజయ డిసిల్వ, ఇసురు ఉదాన, కసున్‌ రజిత, లసిత్‌మలింగ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -