Friday, April 26, 2024
- Advertisement -

ర‌హానే సూప‌ర్ కెప్టెన్సీ..

- Advertisement -

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టీమిండియా స‌రికొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. నిర్న‌యాత్మ‌క నాలుగో టెస్టులో అద్భుత విజ‌యం సాధించి ఆతిథ్య జ‌ట్టును మ‌ట్టిక‌రిపించింది. ఆసీస్ విధించిన 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భార‌త జ‌ట్టు 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. 3 వికెట్ల తేడాతో ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును చిత్తు చేసి ప‌ర్య‌ట‌న‌ను దిగ్విజ‌యంగా ముగించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా రిషభ్‌ పంత్ నిలిచాడు. 138 బంతుల్లో 89 ప‌రుగుల చేసి నాటౌట్గా నిలిచాడు. పంత్‌తో పాటు ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్‌ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌తో భార‌త్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

కాగా అడిలైడ్ టెస్టులో ప‌రాజ‌యంతో టెస్టు సిరీస్ ఆరంభించిన భార‌త్.. బాక్సింగ్ డే టెస్టుతో బ‌దులు తీర్చ‌కుంది. సిడ్నీలో జ‌రిగిన మూడో టెస్టును డ్రాగా ముగించింది. ఇక గ‌బ్బా స్టేడియంలో జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో యువ ఆట‌గాళ్ల అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో అపూర్వ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. త‌ద్వారా 32 ఏళ్లుగా అక్క‌డ ఓట‌మి చూడ‌ని కంగారూల‌కు గ‌ట్టి షాకిచ్చింది.

ఇక పింక్‌బాల్ టెస్టు త‌ర్వాత రెగ్యుల‌ర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెట‌ర్నిటీ లీవ్‌పై స్వ‌దేశానికి తిరిగి రాగా.. అజింక్య ర‌హానే సార‌థ్య బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు అందుబాటులో లేకున్నా యువ ఆట‌గాళ్లతోనే మెల్‌బోర్్నలో గెలుపు, సిడ్నీలో విజ‌యం, బ్రిస్బేన్‌లో చిర‌స్మ‌ర‌ణీయ ప్ర‌ద‌ర్శ‌న‌తో సిరీస్‌ను చేజిక్కుంచుకుని అంద‌రి చేతా ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. సూప‌ర్ కెప్టెన్సీతో బోర్డ‌ర్‌- గావ‌స్క‌ర్ ట్రోఫీని ముద్దాడాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -