Friday, March 29, 2024
- Advertisement -

టెస్ట్ సిరీస్ క్లీన్ స్విప్ పై భారత్ గురి…

- Advertisement -

విండీస్ టూర్ లో ఉన్న టీమిండియా టెస్ట్ సిరీస్ క్లాన్ స్విప్ పై గురి పెట్టింది. వన్డే,టీ20 సిరీస్ లను కౌవసం చేసుకుంది కోహ్లీసేన. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులో విండీస్ పై 318 పుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఈ విజయంతో ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 60 పాయింట్లు సాధించింది. ఇదే స్ఫూర్తితో ఇండియా రేపు జమైకాలోని సబీనా పార్కు మైదానంలో విండీస్‌తో జరిగే రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది.

బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో టీమిండియా పటిష్టంగా ఉంది.కెప్టెన్ విరాట్‌కోహ్లి(51) , వైస్ కెప్టెన్ రహానే(81, 102) ఫామ్‌లో ఉన్నారు. వారితో పాటు హనుమ విహారి(93), జడేజా(58) టచ్‌లో ఉన్నారు.వచ్చిన చిక్కల్లా వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తోనే. అతను ఈ పర్యటన మొత్తంలో ఒకే అర్ధ సెంచరీ(65) సాధించగా దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ విఫలమవుతున్నాడు. బ్యాటింగ్ లో కొన్ని మార్పులు చేసుకుంటె టీమ్ కు మరింత బలం.

బౌలింగ్ లో బుమ్రా, ఇషాంత్, షమీలతో కూడిన పేస్ దళం బీభత్సమైన ఫామ్‌లో ఉండగా, స్పిన్నర్లు జడేజా, కుల్దీప్ పర్వాలేదనిపిస్తున్నారు. పార్ట్ టైం స్పిన్నర్ విహారీ సైతం ఆకట్టుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -