Tuesday, April 23, 2024
- Advertisement -

కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన బీసీసీఐ

- Advertisement -

త్వరలో టీమిండియా విండీస్ పర్యటనకు బయల్దేరనున్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ ల మధ్య ఉన్న విబేధాలను త్వరగా పరిష్కరించడంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది. లేకుంటే జట్టుపై తీవ్ర ప్రభావం చూపె అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది బోర్డు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20లను విండీస్‌తో భారత్‌.. యూఎస్‌లో తలపడనుంది. ఇదే సమయంలో బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి కూడా యూఎస్ వెల్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించేందుకే వెల్తున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గించి జట్టు మరింత సమష్టిగా రాణించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది.

మరోవైపు ఈ విషయంపై ఆటగాళ్లతో టీమిండియా కోచ్‌ రవిశాస్త్రిని మాట్లాడించే అవకాశం ఉందని సమాచారం. రవిశాస్త్రి స్వయంగా మాట్లాడితే ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు సమసిపోతాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపినట్లు తెలుస్తోంది. ధోనీ సారథి బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడు జట్టు పగ్గాలను కోహ్లీ అందుకున్నాడు. ఆ సమయంలో రవిశాస్త్రి జట్టుతోనే ఉన్నాడు. జట్టులో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా అందర్నీ ఒక తాటిపైకి తీసుకవచ్చాడు. ఇప్పుడు కూడా ఆటగాళ్లతో రవిశాస్త్రి మాట్లాడితే జట్టులో ఏమైనా లుకలుకలు ఉంటే తొలగిపోతాయని బీసీసీఐ భావిస్తోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -