Sunday, April 28, 2024
- Advertisement -

ప్ర‌పంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో చ‌రిత్ర సృష్టించిన మేరీ కోమ్‌..

- Advertisement -

భారత బాక్సింగ్ స్టార్ మేరీకోమ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో స్వ‌ర్ణం సాధించింది. శనివారం జరిగిన 48 కేజీల విభాగం ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన హనా ఒఖోటాను 5-0తో మట్టి కరిపించింది.దీంతో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా ఈ మణిపురి మణిపూస చరిత్ర సృష్టించింది.

48 కిలోల విభాగంలో పోటీ పడిన మేరీ కోమ్‌కు ఇది ఆరో స్వర్ణం. ఇంతకు ముందు 2002, 2005, 2006, 2008, 2010 ఏడాది వరల్డ్ వుమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాలు గెలిచింది మేరీ కోమ్. క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా బాక్సర్ వుయ్‌ను 5-0 తేడాతో ఓడించిన మేరీకోమ్… సెమీఫైనల్‌లో నార్త్ కొరియాకు చెందిన కిమ్ హాంగ్‌ను ఓడించింది.

గెలుపునంతరం మేరీ భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గత కొన్నేళ్లుగా తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే తన లక్ష్యంగా పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -