Thursday, May 9, 2024
- Advertisement -

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ మూర్తితో స‌హా 7గురికి 5 సంవ‌త్స‌రాలు జైలుశిక్ష

- Advertisement -
Justice CS Karnan ‘Sentences’ Chief Justice, 7 Supreme Court Judges to five years jail

భార‌త న్యాయ‌వ్వ‌వ‌స్థ‌లో వింత సంఘ‌ట‌న చోటు చేసుకుంది. కోర్టులు నేరంచేసిన వారికి శిక్ష‌లు విధిస్తారు. ఇది ఏ ద‌శంలోనైనా స‌ర్వ‌సాధార‌నం.

మ‌రి జ‌డ్జీల‌కే జైలు శిక్ష విధిస్తే ఆశ్చ‌ర్యంగా ఉందా…! మీరు విన్న‌ది నిజ‌మే …. ఏదో మామూలు జ‌డ్జికి అనుకుంటె పోర‌పాటె ఏకంగా సుప్రీం కోర్టు న్యాయ మూర్తితో స‌హా ఏడుగురి జ‌డ్జీల‌కు ఐదు సంవత్సరాలుపాటు జైలు శిక్షను విధించాడు బాంబేహైకోర్టు న్యాయ మూర్తి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు… కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్కు మధ్య సాగుతున్న వివాదం ఎవ‌రూ ఊహించ‌ని మ‌రో మ‌లుపు తిరిగింది. దళిత న్యాయమూర్తిని వేధించారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్ సీఎస్ కర్ణన్ శిక్షలు విధించారు. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఏడుగురి జ‌డ్జీల‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం ద్వారా జస్టిస్ కర్ణన్ మరో వివాదానికి తెరతీశారు.

{loadmodule mod_custom,Side Ad 1}
ఈ సంవ‌త్స‌రం మార్చి నెలలో కోర్టు ధిక్కరణ కేసులో జస్టిస్ కర్ణన్ సుప్రీం ముందు హాజరయ్యారు. అప్ప‌టి నుంచి వారి మ‌ధ్య స‌మ‌స్య‌తీవ్ర‌రూం దాల్చింది. కోర్టు ధిక్కరణ కేసుకు స్పందించకుండానే సుప్రీం బెంచ్లో ఉన్న ఏడుగురు న్యాయమూర్తులకు సమన్లు కూడా జారీ చేశారు క‌ర్ణ‌న్‌. ప్రధాన న్యాయమూర్తి జేఎస్ ఖేహర్తో పాటు ఆరుగురు జడ్జిలు తన ముందు హాజరుకావాలంటూ మరో వివాదాస్పద ఆదేశం కూడా జస్టిస్ కర్ణన్ జారీ చేశారు. అయితే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్న జస్టిస్ కర్ణన్కు మే 4వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించగా…జస్టిస్ కర్ణన్ వైద్య పరీక్షలను తిరస్కరించారు. ఈసందర్భంగా ఆయ‌న‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఆయన తప్పుపట్టారు. పిచ్చి జడ్జిలు ఇచ్చిన పిచ్చి ఆదేశాలంటూ విమర్శించారు. తాను మాన‌సికంగా ఫిట్గా ఉన్నట్లు ఆయన చెప్పారు. తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇది న్యాయ వ్య‌వ‌స్థ‌లో ఎటువంటి ప‌రినామాల‌కు దారితీస్తుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -