Thursday, May 9, 2024
- Advertisement -

కేజ్రీవాల్ అవినీతిపై రేపు సీబీఐ అధికారులను కలుస్తానన్న ఆప్ తిరుగుబాటు నేత క‌పిల్ మిశ్రా

- Advertisement -
kapil misra will meet to cbi proof against Arvind Kejriwa tomorrow

ఆప్ పార్టీలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. పార్టీ క‌న్వీన‌ర్ ..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సొంత‌పార్టీలో చెల‌రేగిన తిరుగు బాటుతో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.కేజ్రీవాల్‌ను వెన్నంటి ఉండి, ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన నాయకుడు..

కపిల్ మిశ్రా ఒక‌రు.అన్నాహజారే మొదలుపెట్టిన అవినీతి రహిత ఉద్య‌మంలో పాల్గొన్న క‌పిల్ మిశ్రా కేజ్రీవాల్‌కు బాగా సన్నిహితంగా మెలిగిన మిశ్రా.. ఇప్పుడు ఆయనపైనే బాంబులు పేలుస్తున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకుంటుండగా తాను ప్రత్యక్షంగా చూశానంటూ ప్రకటించి ప్రకంపనలు సృష్టించారు.దీంతో ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్ విచార‌న‌కు ఆదేశించారు.
ఇప్పటికే అవినీతి నిరోధక శాఖకు తనవద్ద ఉన్న ఆధారాలు సమర్పించిన మిశ్రా, ఆ తర్వాత సీబీఐని కూడా క‌లుస్తాన‌ని చెప్పారు.క‌పిల్ మిశ్రాపై ఆప్ న‌తేలు చేసిన వ్యాఖ్య‌లును ఖండించారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని బహిష్కృత నేత కపిల్ మిశ్రా పునరుద్ఘాటించారు. మంత్రి సత్యేందర్ జైన్ కేజ్రీవాల్ బంధువొకరికి ఎడెకరాల భూమి విషయంలో సాయం చేశారని కపిల్ సోమవారం మీడియా సమావేశంలో ఆరోపించారు.
‘నేను ‘ఆప్’ను వదిలే ప్రసక్తే లేదు. నన్ను బహిష్కరించే దమ్ముందా అని ఆప్ నేతలను బహిరంగంగా సవాల్ చేస్తున్నా. కేజ్రీవాల్ పై రేపు సీబీఐ వద్ద కేసు పెడతా’ అని కపిల్ పేర్కొన్నారు.
కొన్ని రోజుల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీలోని ప్రముఖ నాయకుల్లో ఒకరిగా పేరొందిన మిశ్రాను ఇప్పుడు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా బీజేపీ ఏజెంటు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ఖండించారు. బీజేపీ సహా మోదీని ఆప్ తరఫున బాగా విమర్శించింది తానేనని ఆయన అన్నారు. ప్రతిసారీ కేజ్రీవాల్‌ను కాపాడుతూ ప్రకటనలు చేసేన క‌పిల్ మిశ్రాకు ఇన్నాళ్ల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ మీద తిరుగుబాటు చేయడానికి మిశ్రాకు మనసొప్పింది.
కేజ్రీవాల్ పై అవినీతి ఆరోపణలు చేసినప్పటి నుంచి బెదిరింపులు వస్తున్నాయని…అయితే వాటికి బెదిరేది లేదన్నారు. కేజ్రీవాల్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆప్ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఈ సందర్భంగా కపిల్ మిశ్రా ఆరోపించారు.ఎన్ని బెదిరింపులు వచ్చిన అవినీతిపై పోరాటం ఆపబోనని కపిల్ స్పష్టం చేశారు. ఆప్‌లో ఏర్ప‌డిన ఈముస‌లం ఇంకెన్ని సంచ‌ల‌నాల‌కు దారితీస్తాదో చూడాలి మ‌రి.

Related

  1. అవినీతి నిరోధ‌క‌శాఖను విచార‌న‌కు ఆదేశించిన ఢిల్లీ గ‌వ‌ర్న‌ర్‌
  2. అతి పిన్న వ‌య‌సులోనే ఫ్రాన్స్ అధ్య‌క్షుడిగా చ‌రిత్ర‌ సృష్టించ‌న మాక్రాన్‌
  3. ప‌శువుల దాణా కుంభ‌కోనం కేసులో లాలూకు ఎదురుదెబ్బ
  4. అవినీతి ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న కేజ్రీ వెంట‌నే రాజీనామ చేయాలి కాంగ్రెస్ పార్టీ నేత అజ‌య్ మాకెన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -