లోకేష్ టార్గెట్‌గా జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌….అక్క‌డి నుంచి జెండా పీకేయాల్సిందేనా…?

1154
AP CM YS Jagan Mohan reddy focus on mangalagiri developmet
AP CM YS Jagan Mohan reddy focus on mangalagiri developmet

జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి క‌నీసం రెండు నెలలు కాక‌ముందె టీడీపీ మాజీ మంత్రి నారాలోకేష్ ట్విట్ట‌ర్‌లో ఘాటుగా విమ‌ర్శ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌భుత్వానికి కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. లోకేష్ ట్విట్ట‌ర్‌లో జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్ అస‌లు లోకేష్ స్థానానికే ట‌ర్గెట్ పెట్టారు.

వ‌చ్చె ఎన్నిక‌ల్లో మ‌రో సారి మంగ‌ళ‌గిరినుంచె పోటీ చేస్తాన‌ని లోకేష్ ప్ర‌క‌టించారు. అయితే అక్క‌డ లోకేష్‌కు స్థానంలేకుండా చేయ‌డానికి జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. ప్ర‌ధానంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క వ‌ర్గంపై దృష్టిసారించారు. సొంత నియోజ‌క వ‌ర్గం పులివెంద‌ల కంటె ఎక్కువ నిధులు మంగ‌ళ‌గిరికే కేటాయంచారు.

ఏపీలో అనేక ప‌ట్ట‌ణా లు..న‌గ‌రాలు శాటిలైట్ టౌన్ షిప్‌గా అభివృద్ది చేసేందుకు ఎంపిక చేసారు.మంగ‌ళ‌గిరి శాటిలైట్ టౌన్ కోసం అని ప్ర‌స్తావిస్తూ 50 కోట్లు బ‌డ్జెట్‌లో కేటాయించారు. దీని ద్వారా లోకేష్‌కు చెక్ పెట్టార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నికల్లో లోకేశ్ మంగ‌ళగిరి నుండి పోటీ చేయ‌కుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు.

2014 ఎన్నిక‌ల కంటే తాజా ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు మెజార్టీ భారీగా త‌గ్గించిన జ‌గ‌న్ ఇప్పుడు లోకేష్‌ను టార్గెట్ చేశారు. మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ నుండి మంగ‌ళ‌గిరి అభ్య‌ర్దిగా లోకేశ్ ను ప్ర‌క‌టించినా..జ‌గ‌న్ త‌మ అభ్య‌ర్దిని మార్చ‌లేదు. ఆళ్ల రామ‌కృష్ణారెడ్డినే బరిలోకి దించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం చివ‌రి రోజున మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.

మంగ‌ళ‌గిరిలో ఓడిన లోకేశ్ తాను ఓడినా..మంగ‌ళ‌గిరి ప్రజ‌ల మ‌ధ్యే ఉంటానంటూ ఇప్ప‌టికే ప‌లుమార్లు మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించారు. స్థానిక నేత‌ల‌తో సంప్రదింపులు జ‌రుపుతూ బ‌ల‌మైన పునాది వేసుకుంటున్నారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో లోకేశ్ ఎక్క‌డైతే దృష్టి పెట్టారో అక్క‌డే రాజ‌కీయంగా లోకేశ్ ను దెబ్బ తీయాని జ‌గ‌న్ డిసైడ్ అయ్యారు. ఆర్కేకు మంత్రి ప‌ద‌వి ఇచ్చే వ‌ర‌కు రాజ‌ధానికి సంబంధించిన నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు .

మంగ‌ళ‌గిరిని శాటిలైట్ టౌన్ షిప్ గా అభివృద్ది చేసేందుకు 50 కోట్ల‌ను బ‌డ్జెట్‌లో కేటాయించారు. ఏపీలో శాటిలైట్ టౌన్ షిప్‌లుగా అభివృద్ది కోసం ఎన్నో ప‌ట్ట‌ణాల‌ను ఎంచుకున్నారు. కానీ, మంగ‌ళ‌గిరికి మాత్ర‌మే ఈ బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించారు. దీని ద్వారా తాను నివాసం ఉంటున్న నియోజ‌క‌వ‌ర్గాన్ని అభి వృద్ది చేయ‌టంతో పాటుగా భ‌విష్య‌త్ లో మంగ‌ళ‌గిరిలో లోకేశ్ కు అవ‌కాశం లేకుండా చేయ‌ట‌మే దీని వెనుక ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యంగా క‌నిపిస్తోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Loading...