పెళ్లిపై ఎవరితోనో మరోసారి క్లారిటీ ఇచ్చిన అనుష్క..!

17983
Anushka Gives Calrity On Her Marriage
Anushka Gives Calrity On Her Marriage

టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అనుష్క. ఆమె పెళ్లి గురించి గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ తో ప్రేమలో ఉందని.. ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఎన్ని వార్తలు వచ్చిన అనుష్క మాత్రం గతంలో పలు సార్లు క్లారిటీగా తాను తల్లిదండ్రులు చూపించిన అబ్బాయిని చేసుకుంటాను.. ప్రేమ వివాహం చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది. అయినప్పటికి ఈ వార్తలు ఆగలేదు. ఇక ఇటీవలే అనుష్క ఒక క్రికెటర్ తో ప్రేమలో ఉంది అంటూ ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. బెంగళూరుకు చెందిన ఆ క్రికెటర్ తో అనుష్క పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. దాంతో అందరు ఈ వార్త నిజమే అనుకున్నారు. మీడియాలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై అనుష్క మరోసారి స్పందించింది.

తన తల్లిదండ్రులు చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. ప్రేమలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చింది. భాగమతి సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క నిశబ్దం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని కారణాల చేత ఈ సినిమా వాయిదా పడింది. సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Loading...