ప్రజలు కాల్ చేస్తే వెంటనే స్పందించాలి : అధికారులకు సీఎం ఆదేశాలు

626
ap Cm Ys Jagan Orders To Officers That Regularly Check Corona Call Centres
ap Cm Ys Jagan Orders To Officers That Regularly Check Corona Call Centres

ఏపీలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చాలా బాగా చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో 85 శాతం నుంచి 90 శాతం క్లస్టర్లు ఉన్న ప్రాంతాల్లోనే చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ లో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 104, 14410 కాల్‌ సెంటర్లు సమర్థంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు నెంబర్లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అన్నది ఎప్పటికప్పుడు అధికార్లు గమనించాలని అన్నారు. ప్రజలు కాల్ చేస్తే వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు. అలానే రాష్ట్రంలో ఉన్న 139 కరోనా ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో భోజనం, పారిశుద్ధ్యంపై సీఎం ఆరా తీశారు. దీంతో కరోనా బాధితులకు కచ్చితంగా మెనూ అమలు చేస్తున్నట్లు అధికార్లు తెలిపారు.

టెలీ మెడిసిన్‌ కింద మందులు పొందిన వారికి మళ్లీ పోన్‌ చేసి సేవలపై ఆరా తీయాలని అధికారులకు సూచించారు. అప్పుడప్పుడు కాల్ చేసి అవి పని చేస్తున్నాయా ? లేదా ? అని చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని జగన్ పేర్కొన్నారు. కాల్ సెంటర్ సేవలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయాలని.. లోపాలు లేకుండా చూసుకోవాలని అన్నారు.

లోపాలు వస్తే అంగీకరించి వాటిని సరిదిద్దుకున్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని అన్నారు. అవసరాలకు అనుగుణంగా అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలని.. కోవిడ్‌ ఆస్పత్రుల వివరాలు కూడా ఈ పోస్టర్‌లో ఉండాలని.. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలన్న దానిపై ఏఎన్‌ఎం తగిన విధంగా మార్గనిర్దేశం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

జగన్ కొట్టి మాట్లాడతారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన పృథ్వీ..!

జగన్ హ్యాపీ ఫీల్ అయ్యే విషయం చెప్పిన చిరు, సురేష్ బాబు..!

Loading...