Friday, April 26, 2024
- Advertisement -

ఏపీ లో కరోనా కలకలం.. ఒక్క రోజులో 6045 కేసులు..!

- Advertisement -

ఏపీలో కరోనా ఉగ్ర రూపం చూపిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి ఎవర్ని వదిలేలా లేదు. రాష్ట్రంలో చాలా చోట్ల కరోనా వ్యాప్తి చెందింది. ఉహించని రీతిలో రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. దానికి తోడు మరణాలు కూడా తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 6045 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా.. తాజాగా వైరస్ తో బాధపడుతూ 65 మంది మృతి చెందారు. ఈ విధంగా కేసులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ఏపీ ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. దేశంలో సాముహిక వ్యాప్తి మొదలైందని వార్తలు వస్తున్న క్రమంలో ఏపీలో కూడా ఆ పరిస్థితి ఏర్పడిందా అనేలా కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 49553 నమూనాలు పరీక్షించడంతో అన్నేసి కేసుల వెలుగులోకి వచ్చాయి. కొత్త పద్ధతిల్లో పరీక్షలు చేస్తుండడంతో కేసులు అమాంతం పెరగడానికి కారణమైంది.

తాజాగా 6494 మంది వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు. మొత్తం డిశ్చార్జయిన వారి సంఖ్చ 32127… మొత్తం మృతుల సంఖ్య 823. ప్రస్తుతం ఏపీలో 31605 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చేసిన పరీక్షలు 1435 827. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అనంతపురం( 6266) – కర్నూలు(7797) – గుంటూరు(6913) – తూర్పుగోదావరి( 8647)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్నాయి.

అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్..!

జగన్ ఊహించని షాక్.. ఈసీగా నిమ్మగడ్డ కొనసాగింపు..!

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

నారా బ్రాహ్మణికి ఊహించని షాక్ ఇచ్చిన సీఎం జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -