Thursday, May 2, 2024
- Advertisement -

జగన్ ఊహించని షాక్.. ఈసీగా నిమ్మగడ్డ కొనసాగింపు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని మళ్లీ తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్ ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను తిరిగి తన ప్లేస్ లోకి మళ్లీ తీసుకోవాలని ఏపీ ప్రభుత్వంకి ఆయన సంచలన ఆదేశాలు జారీ చేశారు.

నిమ్మగడ్డ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంత పెద్ద హడవుడికి కారణం అయిందో మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ప్రభుత్వం తీసివేసే ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఏపీ హైకోర్టు కూడా ఉత్తర్వులు ఆర్డర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని అమలు పరచలేదని ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ని కావాలనే నిమ్మగడ్డను టార్గెట్ చేశారనే ఆరోపణలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి అనుకున్నది కుదరనట్టే కనిపిస్తోంది. కాంప్రమైజ్ అనే అంశానికి నిమ్మగడ్డ ఎక్కడా తగ్గలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించడం మీద వివాదం ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటూ ముందుకు సాగింది. రకరకాల పిటిషన్లు.. రకరకల హడావుడిలు జరిగిన సంగతి మనకు తెలిసిందే. సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారం వెళ్లి అక్కడ కూడా ఏపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినా కూడా జగన్ మోహన్ రెడ్డి మొండి పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని పదవి ఎక్కించలేదని ఆరోపణ ఉంది.

అప్పట్లో కావాలనే కనకరాజు తీసుకొచ్చిన కూడా దానికి ఏపీ హై కోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే సుప్రీం కోర్టు ముందు తాము దాఖలు చేసిన స్పెషల్ న్యూ పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం పిటిషన్ ను కోర్టుకు నివేదిక కూడా ఇచ్చింది. అయితే దీన్ని కోర్టు పట్టించుకోలేదు. ఎన్నికల కమిషనర్ ని గవర్నర్ నిమించాలనేటువంటి హైకోర్టు తీర్పు చెల్లుబాటు కాదనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అందులో వివరించింది.

ఈ నెల 8న తమ ఎస్‍ఎల్‍పీ సంబంధించి విచారణకు వచ్చిన సమయంలో నాలుగు వారాల తర్వాత తుది విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వ ఈ పిటిషన్ ను గుర్తు చేసింది. ఏపీ హైకోర్టు తేల్చిన దాని ప్రకారం నిమ్మగడ్డను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని అలా తీసుకోవడం దిశగా గౌవర్నర్ దగ్గరకు వెళ్లి మాట్లాడాలని కోర్టు నేరుగా నిమ్మగడ్డను గౌవర్నర్ దగ్గరకు వెళ్లమని కోరడం.. రెండు రోజుల క్రితం నిమ్మగడ్డ గవర్నర్ దగ్గరికి వెళ్లడం కూడా మనం చూశాం. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని దెబ్బ ఎదురైనట్లు కనిపిస్తోంది.

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -